LinkedIn: పని, కుటుంబ ఒత్తిళ్లు.. కొత్త నైపుణ్యాలకు దూరం!

LinkedIn: ఉద్యోగంలో ఉన్న వారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారని లింక్డిన్‌ తాజాగా చేపట్టిన సర్వేలో తేలింది.

Published : 19 Jun 2024 00:08 IST

LinkedIn | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొలువు సాధించాలన్నా.. కొనసాగుతున్న వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త నైపుణ్యాల్లో పట్టు సాధిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోగించగలం. అయితే, కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఉద్యోగులు దృష్టి సారించలేకపోతున్నారట. ఈ విషయం తాజా నివేదికలో వెల్లడైంది.

దేశంలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది పని, కుటుంబ ఒత్తిడి కారణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకొనే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. చాలా మంది నిపుణులు కొత్త విషయాలు అభ్యసించేందుకు వారు పనిచేసే సంస్థలు అవకాశం కల్పిస్తున్నా వినియోగించుకోలేకపోతున్నారట. ప్రముఖ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ లింక్డిన్‌ (LinkedIn) తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

భారత్‌కు గూగుల్‌ జెమిని యాప్‌.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!

కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కారణాల రీత్యా 34 శాతం, బిజీ వర్క్ షెడ్యూల్స్‌ కారణంగా 29 శాతం, అభ్యసన వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల 26 శాతం మంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నారని లింక్డిన్‌ తన నివేదికలో పేర్కొంది. ‘‘2030 నాటికి దేశంలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు 64 శాతం మారుతాయి. కాబట్టి కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం’’ అని లింక్డిన్‌ కెరీర్‌ ఎక్స్‌పర్ట్‌, సీనియర్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ నిరజితా బెనర్జీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని