Budget 2023: యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీ

యువతలో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్‌(Nirmala Sitharaman ) చెప్పారు. బడ్జెట్‌లో దీని గురించి వెల్లడించారు. 

Updated : 01 Feb 2023 12:41 IST

దిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరం నిమిత్తం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయస్సు వారి కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. భౌగోళిక, భాషాపరమైన, కళలపరంగా,అన్ని స్థాయుల్లో పుస్తకాలను ఇది అందుబాటులోకి ఉంచుతుంది. ‘యువత కోసం పంచాయతీ, వార్డు స్థాయుల్లో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తాం. అలాగే నేషనల్ డిజిటల్‌ లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావాల్సిన మౌలిక వసతులకు తోడ్పాటునందిస్తాం’ అని మంత్రి వెల్లడించారు.

దాంతో పాటుగా రానున్న మూడు సంవత్సరాలకు 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్ పాఠశాల కోసం నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అందుకోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని తీసుకుంటామన్నారు. ఈ పాఠశాలల కింద 3.5 లక్షల గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని