Insurance: కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన నివా బుపా
నివా బుపా కొత్త ఆరోగ్య పాలసీ ‘రీ అస్యూర్ 2.0’ను ప్రారంభించింది. ‘రీ అస్యూర్ Forever’, బూస్టర్+ అనే ఫీచర్లు దీని ప్రత్యేకత.
ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థ ‘నివా బుపా’ కొత్త ఆరోగ్య పాలసీ ‘రీ అస్యూర్ 2.0’ను ప్రారంభించింది. పాలసీ వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ ఫ్లోటర్‌గా అందుబాటులో ఉంటుంది. ‘రీ అస్యూర్ 2.0’ పాలసీ పునరుద్ధరణ ప్రాతిపదికన పొందే ఆరోగ్య పాయింట్లపై 30% వరకు ప్రీమియం తగ్గింపు పొందొచ్చు. ఈ కొత్త పాలసీ ప్లాటినం+, టైటేనియం+ అనే రెండు రకాల్లో అందుబాటులో ఉంది. ప్లాటినం+ వేరియంట్ కింద, రూ.10 లక్షల కవర్‌ను కొనుగోలు చేసే 40 ఏళ్ల వ్యక్తికి వార్షిక ప్రీమియం రూ.11 వేలు(+జీఎస్‌టీ) ఉంటుంది.
రీఅస్యూర్ ‘Forever’
ఈ ఫీచర్‌తో పాలసీదారు తన మొదటి క్లెయిమ్ చేసి తర్వాత బేస్ ఇన్సూర్డ్ మొత్తానికి సమానమైన బీమా మొత్తాన్ని కలిగి ఉంటారు. ఉదా: ఒక వ్యక్తి రూ.10 లక్షల కవర్ కలిగి ఉంటే, మొదటి క్లెయిమ్ మొత్తం రూ.5 లక్షలు అయితే, రీఅష్యూర్ ‘Forever’ ట్రిగ్గర్ చేస్తారు. ఏ సమయంలోనైనా, ఆ వ్యక్తి చేసిన క్లెయిమ్‌లతో సంబంధం లేకుండా, ఆ సంవత్సరంలో తదుపరి క్లెయిమ్‌ల కోసం, అలాగే పునరుద్దరణ సమయంలో కూడా పాలసీదారుడు బేస్ బీమా మొత్తాన్ని కలిగి ఉంటారు.
వయసు పెరిగినా ప్రీమియం మారదు
సాధారణంగా ద్రవ్యోల్బణం, పాలసీదారుని వయసు కారణంగా ఆరోగ్య బీమా పునరుద్ధరణ ప్రీమియంలు పెరుగుతాయి. అయితే పాలసీదారులు ఈ పాలసీలోకి ప్రవేశించిన తర్వాత, క్లెయిమ్ చేసే వరకు ‘వయసు’ లాక్ అవుతుంది. ఉదా: ఒక వ్యక్తి 35 సంవత్సరాల వయసులో పాలసీని కొనుగోలు చేస్తే..మొదటి క్లెయిమ్ చేసేవరకు, వయసు పెరిగినా కూడా 35 సంవత్సరాల ఏజ్-బ్యాండ్‌కు వర్తించే వార్షిక ప్రీమియం కొనసాగుతుంది. అంటే, ఈ వ్యక్తి 45 సంవత్సరాల వయసులో మొదటి క్లెయిమ్ చేస్తే..35 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి చెల్లించే ప్రీమియం 10 ఏళ్ల వరకు కూడా వర్తిస్తుంది.
బూస్టర్+ ప్రయోజనం
ఉపయోగించని బేస్ బీమా మొత్తం తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వర్డ్ చేయడానికి బూస్టర్+ అనుమతిస్తుంది.
ఈ బీమా మొత్తం ఐదు లేదా పది రెట్ల వరకు ఉండొచ్చు. అయితే, పాలసీదారుడు ప్లాటినం+ లేదా టైటేనియం+ వేరియంట్‌ను ఎంచుకున్నారా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బీమా మొత్తం 5X, 10X వరకు ప్రతి పునరుద్ధరణకు జమ అవుతూనే ఉంటుంది.
సేఫ్‌గార్డ్
పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ రూ.1 లక్ష లోపు ఉన్నట్లయితే బూస్టర్+ ప్రయోజనాన్ని కాపాడుకోవడంతో అదనపు క్లెయిమ్‌కు అవకాశం ఉంటుంది. అంటే, క్లెయిమ్ మొత్తం రూ.1 లక్షలోపు ఉన్నట్లయితే, బేస్ బీమా మొత్తాన్ని ఎలాంటి తగ్గింపులు లేకుండా తదుపరి పాలసీ సంవత్సరానికి ఫార్వార్డ్ చేస్తారు. పాలసీదారులు(ఆరోగ్య స్థితిపై ఆధారపడి), పునరుద్ధరణ ప్రీమియంలపై 30 శాతం వరకు తగ్గింపునకు అర్హులు.
ఇతర ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో గది అద్దె ఉప-పరిమితులు లేవు. 2 గంటలు, అంతకంటే ఎక్కువ సమయం పాటు ఏ ఆసుపత్రిలో చేరినా బీమా కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ తో స్మార్ట్ హెల్త్+ రైడర్ తీసుకుంటే..అపరిమిత టెలి కన్సల్టేషన్‌లను పొందొచ్చు. పాలసీ మొదటి రోజు నుంచి మధుమేహం, హైపర్‌టెన్షన్‌ను కవర్ చేస్తుంది. 18-65 సంవత్సరాల వయసు వారు రూ.5 లక్షల నుంచి రూ.1 కోటి వరకు బీమా మొత్తాన్ని ఈ పాలసీలో తీసుకోవడానికి వీలుంది. పాలసీ వ్యక్తిగతంగా, ఫ్యామిలీ ఫ్లోటర్‌గా అందుబాటులో ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD Temple: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. పిచ్‌పై తగ్గిన పచ్చిక.. వైరల్‌గా మారిన దినేశ్ కార్తిక్ ఫొటోలు!
-
Sports News
wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రెండు పిచ్‌లు సిద్ధం.. ఎందుకంటే..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!
-
Crime News
Sattenapalle: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అనుమానంతో..