Rupay క్రెడిట్‌కార్డుతో ఆ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలు ఉండవు: NPCI

రూపే క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.2వేల వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండబోవని నేషనల్‌ పేఎమంట్‌ కార్పొరేషన్‌ (NPCI) స్పష్టంచేసింది.

Published : 06 Oct 2022 03:08 IST

దిల్లీ: రూపే క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.2వేల వరకు చేసే UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండబోవని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (NPCI) స్పష్టంచేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఎటువంటి ఛార్జీలూ విధించడం లేదని ఎన్‌పీసీఐ తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. దేశీయంగా అభివృద్ధి చేసిన పేమెంట్‌ గేట్‌వేను ప్రోత్సాహించే ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశంలో గడిచిన నాలుగేళ్లుగా రూపే కార్డులు వాడుకలో ఉన్నాయి. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులూ కమర్షియల్‌, రిటైల్‌ సెగ్మెంట్‌లో ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు జరపాలంటే డెబిట్‌ కార్డుల ద్వారా సేవింగ్స్‌ అకౌంట్‌ను లేదా కరెంట్‌ అకౌంట్లను మాత్రమే వినియోగించే వీలుంది. దీంతో క్రెడిట్‌ కార్డులను కూడా యూపీఐ లావాదేవీలకు అనుసంధానించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. తొలుత రూపే క్రెడిట్‌కార్డులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

ఈ నేపథ్యంలో దేశీయ పేమెంట్‌ గేట్‌వే అయిన రూపేను ప్రోత్సహించేందుకు క్రెడిట్‌ లావాదేవీలపై రూ.2వేల వరకు జరిపే లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్‌ ఛార్జీలూ విధించడం లేదని ఎన్‌పీసీఐ స్పష్టంచేసింది. సాధారణంగా క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసినప్పుడు మర్చంట్స్‌.. బ్యాంకులకు ఈ ఛార్జీలను చెల్లిస్తారు. క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే ఈ తరహా లావాదేవీలకు 1-2 శాతం ఎండీఆర్‌ ఛార్జీలు ఉంటాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts