యూపీఐ చెల్లింపులకు రుసుముల్లేవ్‌

డిజిటల్‌ చెల్లింపులు చేసే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ప్లాట్‌ఫాంలలో చెల్లింపులు ఉచితమేనని నేషనల్‌ పేమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) శుక్రవారం

Published : 01 Jan 2021 19:49 IST

అసత్య ప్రచారాల్ని నమ్మొద్దన్న ఎన్‌సీపీఐ

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు చేసే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ప్లాట్‌ఫాంలలో చెల్లింపులు ఉచితమేనని నేషనల్‌ పేమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) శుక్రవారం స్పష్టం చేసింది. జనవరి 1, 2021 నుంచి డిజిటల్‌ చెల్లిపులకు ఛార్జీలు వసూలు చేస్తారని వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని  తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం యూపీఐ నుంచి చేసే నగదు చెల్లింపులకు ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయడం లేదు. కరోనా కారణంగా 2020 సంవత్సరంలో డిజిటల్‌ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2008లో ప్రారంభమైన ఎన్‌సీపీఐ సంస్థ భారతదేశంలో రిటైల్‌ చెల్లింపులను నిర్వహిస్తోంది.

ఇవీ చదవండి..

ఐయూసీ రద్దుతో జియోపైనే ప్రభావం

కొవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌ సిగ్నల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని