Amazon: మేమెవర్నీ బలవంతంగా తొలగించలేదు.. రాజీనామాలు స్వచ్ఛందమే: అమెజాన్‌

భారత్‌లో ఏ ఉద్యోగినీ తాము బలవంతంగా విధుల నుంచి తొలగించలేదని అమెజాన్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి వారే స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని పేర్కొంది.

Published : 25 Nov 2022 13:43 IST

దిల్లీ: భారత్‌లో ఏ ఉద్యోగినీ తాము బలవంతంగా విధుల నుంచి తొలగించలేదని అమెజాన్‌ ఇండియా (Amazon India) కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి వారే స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని పేర్కొంది. భారత్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని అమెజాన్‌ ఇండియా తొలగించి కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందంటూ నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక శాఖకు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది.

దీనిపై అమెజాన్‌ ఇండియా తన స్పందనను తెలియజేసింది. బెంగళూరులోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ముందు అమెజాన్‌ ప్రతినిధి నేరుగా హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ.. లిఖిత పూర్వకంగానే సమాధానం తెలియజేసింది. ఏటా అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై తాము సమీక్ష నిర్వహిస్తామని, పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే ఆ ప్రక్రియను చేపడుతుంటామని అమెజాన్‌ తన స్పందనలో పేర్కొంది. పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే పరిహార ప్యాకేజీ చెల్లిస్తుంటామని చెప్పింది. ఎవరైనా ఉద్యోగి ఈ ప్యాకేజీకి అంగీకరించి వైదొలొగొచ్చని, లేదంటే తిరస్కరించే వెసులుబాటునూ కల్పిస్తుంటామని అమెజాన్‌ తెలిపింది. ఇందులో బలవంతం ఏదీ లేదని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని