EPFO: కొవిడ్‌ అడ్వాన్స్‌ నిలిపివేత.. ఈపీఎఫ్‌ఓ నిర్ణయం

EPFO Covid advance: కొవిడ్‌ అడ్వాన్స్‌ ఈపీఎఫ్‌ఓ నిలిపివేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 14 Jun 2024 18:51 IST

EPFO Covid advance | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సమయంలో తీసుకొచ్చిన కొవిడ్‌ అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. కొవిడ్‌ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా ఈ అడ్వాన్సు సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. రెండో వేవ్‌ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్‌ పొందే అవకాశం కల్పించినా.. తర్వాత పలుమార్లు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులోభాగంగా మూడు నెలల బేసిక్‌+ డీఏ లేదా ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు.

మహీంద్రా అదుర్స్‌.. దేశంలోనే రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్‌ కంపెనీగా..

కొవిడ్‌ సమయంలో చాలామందికి ఈ సౌకర్యం ఉపకరించింది. అయితే, ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ను మరికొందరు ఇతర అవసరాలకు కూడా వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌ సదుపాయం నిలిచిపోయినప్పటికీ.. ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని