కేవైసీలో మార్పులు లేకుంటే స్వీయ ధ్రువీకరణ చాలు: ఆర్‌బీఐ

RBI on KYC: కేవైసీలో ఎలాంటి మార్పూ లేకుంటే బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా స్వీయ ధ్రువీకరణకు అవకాశం కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

Published : 06 Jan 2023 13:10 IST

ముంబయి: కేవైసీ (వినియోగదారు గురించి తెలుసుకో) సమాచారంలో ఎటువంటి మార్పులు లేకుంటే.. పునః కేవైసీ (Re-KYC) ప్రక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారు స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తెలిపింది. ఇందుకోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేసింది. నమోదిత ఇ-మెయిల్‌ / ఫోన్‌ నంబరు, ఏటీఎంలు, డిజిటల్‌ ఛానల్‌లు (ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌), లేఖ తదితరాల రూపంలో స్వీయ ధ్రువీకరణ ద్వారా కేవైసీని పూర్తి చేసే సదుపాయాలను ఖాతాదారులకు కల్పించాల్సిందిగా బ్యాంకులకు సూచించింది. చిరునామాలో ఏమైనా మార్పులున్నా, ఈ మార్గాల ద్వారా మార్పు చేసుకోవచ్చు. దీన్ని తనిఖీ చేసి, రెండు నెలల్లోగా చిరునామాను బ్యాంకు నిర్ధారిస్తుంది. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, ఓటర్‌ కార్డ్‌, ఉపాధి హామీ జాబ్‌ కార్డులను ధ్రువీకరణకు అంగీకరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని