పెట్రోల్‌, డీజిల్‌పై సుంకం తగ్గింపుపై కేంద్రం క్లారిటీ!

పెట్రోల్‌, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Published : 10 Feb 2021 21:16 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఇంధన ధరలపై ఉన్న పన్నులను కేంద్రం తగ్గిస్తుందా అన్న ప్రశ్నలను తోసిపుచ్చింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని పేర్కొంది.

ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌లపై సుంకాన్ని తగ్గించే ఆలోచన ఏదీ లేదని రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయని.. దేశ అవసరాలను తీర్చేందుకు భారత్‌ దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగితే మనం కూడా ధరలు పెంచాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడ ధరలు తగ్గినప్పుడు వాటికి అనుగుణంగా ఇక్కడ తగ్గించుకోవాలి. ఇదే నియమాన్ని చమురు కంపెనీలు పాటిస్తాయి. ఇందుకోసం ఆయా సంస్థలకు స్వేచ్ఛ కల్పించాం’ అని మంత్రి బదులిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి అవసరాలకు అనుగుణంగా పన్నులను విధించడంతో ఇంధన ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రభుత్వాలు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయని చెప్పారు.

ఇవీ చదవండి..
హైదరాబాద్‌లో రూ.91 దాటిన పెట్రోల్‌
డిజిలాకర్‌లో బీమా పాలసీ పత్రాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని