ఐదేళ్ల త‌ర్వాత పీఎఫ్‌ఫై ప‌న్ను లేదు

5 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ కాలం ప‌నిచేస్తే పన్ను వర్తించదు

Published : 18 Dec 2020 20:12 IST

నేను సంస్థ A లో 5 ఏళ్ళు పనిచేసి , ఆ తరువాత సంస్థ B లో చేరాను. సంస్థ A నుంచి నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని సంస్థ B కి మార్చుకున్నాను. సంస్థ B లో 5 ఏళ్ల కన్నా తక్కువ కాలం పనిచేసి మానేశాను. ఇప్పుడు నేను నా మొత్తం పీ ఎఫ్ డబ్బులు ఉపసంహరించుకుంటే , మొత్తం మీదా పన్ను వర్తిస్తుందా (సంస్థ A తాలూకు పీఎఫ్ తో కలిపి)?

జవాబు : ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(12) (షెడ్యూల్ 4 లోని రూల్ 8 ) ద్వారా , మీరు 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం నిరంతరం పనిచేసి ఉండి , ఆ తరువాత ఉద్యోగం మానివేసిన నాటికి మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న నిల్వను ఉపసంహరించుకుంటే , ఎటువంటి పన్ను వర్తించదు .

ఒక ఉద్యోగి వివిధ సంస్థలలో పనిచేసి, గత సంస్థల నుంచి పీఎఫ్ మొత్తాన్ని చివరిగా పనిచేసిన సంస్థకు బదిలీ చేసుకుని ఉంటే , 5 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు నిరంతరంగా పనిచేసిన కాలాన్ని లెక్కించేందుకు , అన్ని సంస్థలలో పనిచేసిన ఏళ్లను లెక్కలోకి తీసుకుంటారు. మీ విషయంలో సంస్థ B నుంచి కూడా ఉద్యోగ మానివేసి , పీఎఫ్ ఖాతాలో ఉన్న నిల్వను ఉపసంహరించుకుంటే పన్ను వర్తించదు . ఎందుకంటే మీ మొత్తం పనిచేసి కాలం 5 ఏళ్ల కన్నా ఎక్కువగానే వుంది . అయితే, ఆ తరువాత జమ అయ్యే మొత్తాలకు పన్ను వర్తిస్తుంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని