Nokia c12 Pro: రూ.6,999లకే నోకియా స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లివే

Nokia c12 Pro: నోకియా సీ12 ప్రో స్మార్టఫోన్‌లో 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది రెండు స్టోరేజ్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Published : 22 Mar 2023 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) అనే బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ భారత్‌లో విడుదల చేసింది. రెండు స్టోరేజ్‌, మూడు రంగుల ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఆక్టాకోర్‌ ప్రాపెసర్‌ను అమర్చారు. 6.3 అంగుళాల హెచ్‌డీ+ తెర ఉంది.

నోకియా సీ12 ప్రో ధర..
(Nokia C12 Pro price)

ఈ ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ.6,999. 3జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.7,499. ఈ రెండు ఫోన్లు 2జీబీ వర్చువల్‌ ర్యామ్‌ను సపోర్ట్‌ చేస్తాయి. లైట్‌ మింట్‌, చార్‌కోల్‌, డార్క్‌ సియాన్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్లు..
(Nokia C12 Pro Specifications)

నోకియా సీ12 ప్రోలో 60Hz రీఫ్రెష్‌ రేటుతో 6.3 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ, హెచ్‌డీ+ రెజల్యూషన్‌తో కూడిన తెరను అమర్చారు. డ్యుయల్‌ సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 (గో ఎడిషన్‌) ఓఎస్‌ను ఇస్తున్నారు. రెండేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తారు. అలాగే రెండేళ్ల రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీని కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ కెమెరాను ఇస్తున్నారు. 10వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కలిగిన 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని