మీ ఖాతాకు నామినీ ఉన్నారా?

బ్యాంకు ఖాతాకు నామినీని నియ‌మించుకోని వ్య‌క్తులకు అనుకోనిది ఏదైనా జ‌రిగితే వారిపై ఆధార‌ప‌డిన వారికి చ‌ట్ట‌ప‌రంగా చిక్కులు ఎదుర‌వుతాయి...

Published : 15 Dec 2020 21:52 IST

బ్యాంకు ఖాతాకు సంబంధించి ఖాతాదారుడు త‌న త‌ద‌నంత‌రం ఖాతాలో డ‌బ్బు ఎవ‌రికి చెందాల‌ని సూచిస్తారో వారిని నామినీ అంటారు. నామినీగా బ్యాంకు ఖాతాదారులు త‌మపై ఆధార‌ప‌డిన లేదా న‌మ్మ‌క‌మైన వ్య‌క్తుల‌ను నామినీ గా నియమించుకుంటారు.

నామినీ త‌ప్ప‌నిస‌రి

రిజ‌ర్వు బ్యాంకు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ప్ర‌తీ బ్యాంకు ఖాతాకు నామినీ త‌ప్ప‌నిస‌రి. దీని వ‌ల్ల ఖాతాదారులు హ‌ఠాత్తుగా మ‌రణిస్తే నామినీలు సుల‌భంగా సొమ్ము పొంద‌వ‌చ్చు. కానీ ఇప్ప‌టికీ ఇలా చాలా మంది ఖాతాల‌కు నామినీలు లేరు. అనుకోనిదేమైనా జ‌రిగితే వార‌సుల‌కు స‌వాల‌క్ష ఇబ్బందులు. అందుబాటులో సొమ్ము ఉన్నా అవ‌స‌రానికి వినియోగించుకునే వెసులుబాటు ఉండ‌దు. పైగా అనేక లాంఛ‌నాలు పాటించాలి. నామినీ ఉంటే ఏ విధ‌మైన స‌మ‌స్య ఉండ‌దు. నామినీని నియ‌మించుకోని ఖాతాదారులు మ‌ర‌ణించిన‌ట్ల‌యితే వారిపై ఆధార‌ప‌డిన‌ వారికి చిక్కులు ఎదుర‌వుతాయి. నామినీని అపాయింట్ చేసుకునేందుకు దిగువ‌ పేర్కొన్న ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు

  • మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (అస‌లు).
  • స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఇద్ద‌రు వ్య‌క్తులు స‌మ‌ర్పించిన ఆఫిడ‌విట్టు (నోట‌రీ చేసింది).
  • ఈ వ్య‌క్తులు బ్యాంకుతో పాటు మ‌ర‌ణించిన ఖాతాదారుని కుటుంబానికి తెలిసి ఉండాలి.
  • స్టాంపులు అంటించాల‌న్న‌ది ఖాతాలోని సొమ్మును బ‌ట్టి ఆధారప‌డి ఉంటుంది.
  • ఖాతాలోని సొమ్ముకు విలువైన విలువ గ‌ల రెండు హామీలు.
  • అభ్యంత‌ర ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్) దీన్ని సంక్షిప్తంగా NOC అని అంటారు.
  • మ‌ర‌ణించిన ఖాతాదారుకు సంబంధించిన వారంతా దీనిపై సంత‌కాలు చేయాలి.

ఖాతాలో రూ.25వేల క‌న్నా త‌క్కువుంటే…

మ‌ర‌ణించిన వ్య‌క్తి ఖాతాలో ఉన్న మొత్తం రూ. 25,000 దాట‌క‌పోతే వార‌స‌త్వ స‌ర్టిఫికెట్లు కోసం ప‌ట్టుబ‌ట్ట‌వ‌ద్ద‌ని భారతీయ రిజ‌ర్వు బ్యాంకు సూచించింది. వార‌సుల మ‌ధ్య విభేదాలు త‌లెత్తినా ఇండెమ్నిటీ బాండుపై అంద‌రూ సంత‌కాలు చేయ‌టానికి నిరాక‌రించినా క్లెయిము పై బ్యాంకుకు అనుమానం త‌లెత్తినా… ఖాతాలో మొత్తం రూ.25 వేల‌ లోపున్న వార‌స‌త్వ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌క్సెష‌న్ స‌ర్టిఫికేట్ కోసం డిమాండ్ చేసే అవ‌కాశం ఉంటుంది.

ఇప్ప‌టికీ మీ బ్యాంకు ఖాతాకు నామినీ నియ‌మించ‌లేదా? ఇప్ప‌టికైనా స్పందించి వెంట‌నే బ్యాంకును సంప్ర‌దించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు