PAN Aadhaar: పాన్‌ ఆధార్‌ లింక్‌కు నేడే ఆఖరు తేదీ.. లేదంటే ₹1000 జరిమానా!

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ.. దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. దీనికి మార్చి 31, 2022తో గడువు ముగియనుంది. 

Updated : 31 Mar 2022 10:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ.. దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. దీనికి మార్చి 31, 2022తో గడువు ముగియనుంది. తర్వాత రూ.500-1000 వరకు జరిమానా ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తర్వాతి మూడు నెలలు అంటే జూన్‌ 30, 2022 వరకు అనుసంధానం చేసే వారు రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి 31 తర్వాత ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌లన్నీ ఇన్‌యాక్టివ్‌గా మారతాయి. పైన పేర్కొన్నట్లుగా జరిమానా చెల్లించి అనుసంధానం చేస్తేనే తిరిగి అవి పనిచేస్తాయి.  

బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం ఇలా..

1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ తెరవండి.

2. మొద‌టిసారి లాగిన్ అయ్యే వారు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబరే(శాశ్వత ఖాతా సంఖ్య) మీ యూజర్ ఐడీ అవుతుంది.3. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

4. ఆధార్‌-పాన్ లింక్ కోసం ఒక పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది.

5. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ వంటి స‌మాచారం క‌నిపిస్తుంది.

6. స్క్రీన్‌పై క‌నిపిస్తున్న పాన్ కార్డు వివ‌రాల‌ను ఆధార్‌లో పేర్కొన్న వివరాల‌తో  ధ్రువీకరించుకోవాలి. ఒకవేళ వివ‌రాల‌లో ఏమైనా తేడాలు ఉంటే రెండింటిలో ఒకే విధంగా ఉండేలా సరి చేసుకోవాలి.

7. వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి “ లింక్ నౌ ” బటన్ పై క్లిక్ చేయండి.

8. మీ ఆధార్, పాన్‌తో విజ‌య‌వంతంగా లింక్ అయిన‌ట్లు పాప్-అప్ విండోతో సందేశం వ‌స్తుంది.

9. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో క‌నిపిస్తున్న‌ “లింక్ ఆధార్” పై క్లిక్ చేయడం ద్వారా కూడా నేరుగా అనుసంధానించ‌వ‌చ్చు.

10. https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వెబ్‌సైట్‌ల ద్వారా కూడా ఆధార్, పాన్‌ల‌ను లింక్ చేసుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని