Aadhaar: మరింత సులభంగా ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్!
ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాలతో తరచూ ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యే వారు ఇకపై మరింత సులువుగా తమ ఆధార్‌లో అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చు.
దిల్లీ: ఆధార్ (Aadhaar) కార్డులో అడ్రస్ అప్‌డేట్ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిదాకా ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఉన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒకవేళ అడ్రస్ ధ్రువీకరణ లేకుంటే అడ్రస్ అప్‌డేట్ చేయడం సాధ్యంకాదు. ఇకపై ఈ ప్రక్రియ సులభతరం కానుంది. ఆధార్‌లో అడ్రస్ మార్చుకునేందుకు దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్‌కార్డ్, వివాహ ధ్రువీకరణపత్రం, పాస్‌పోర్ట్ వంటివి కూడా సమర్పించవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారు అడ్రస్ అప్‌డేట్ కోసం సమర్పించిన ధ్రువీకరణ పత్రం సరైంది కాకుంటే, ఉడాయ్ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయధ్రువీకరణ (Self-declaration) సమర్పించాలి. దాన్ని పరిగణలోకి తీసుకుని దరఖాస్తుదారు ఆధార్‌లో అడ్రస్ అప్‌డేట్ చేస్తారు.
‘‘ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాలతో చాలా మంది తరచుగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. అలాంటి వారికి తమ పేరుతో అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు దొరకడం సులువేంకాదు. ఒకవేళ తప్పనిసరిగా ఆధార్‌లో అడ్రస్ మార్చుకోవాలంటే కుటుంబ పెద్ద పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ లేదా వివాహ ధ్రువీకరణపత్రం సమర్పించి అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబసభ్యులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) సులువుగా అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోగలరు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా దీనికి అర్హులు.’’ అని ఉడాయ్ తెలిపింది.
ఈ సేవల కోసం దరఖాస్తుదారు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్‌లోకి వెళ్లి ₹ 50 రుసుము చెల్లించి, తమ కుటుంబ పెద్ద ఆధార్ నంబర్ టైప్ చేయాలి. తర్వాత ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) జారీ అవుతుంది. దరఖాస్తుదారు అడ్రస్ అప్‌డేట్ కోరినట్లు కుటుంబ పెద్ద ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా అభ్యర్థన అందుతుంది. ఆ అభ్యర్థనను కుటుంబ పెద్ద ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఎస్‌ఆర్‌ఎన్ జారీ అయిన 30 రోజుల వ్యవధిలోపు పూర్తి కావాలి. ఒకవేళ కుటుంబ పెద్ద నిర్ణీత వ్యవధిలోపు అడ్రస్ అప్‌డేట్ కోసం పంపిన అభ్యర్థనను తిరస్కరించినా, ధ్రువీకరించకున్నా ఎస్‌ఆర్‌ఎన్ ముగిసిపోతుంది. దీంతో యూజర్ కొత్తగా మరో ఎస్‌ఆర్‌ఎన్‌ను ప్రారంభించాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం