Uber: ఇకపై వాట్సాప్‌లోనూ ఉబర్‌ క్యాబ్‌ బుకింగ్‌!

క్యాబ్‌ సేవలు అందిస్తోన్న ఉబర్‌ క్యాబ్స్‌ సంస్థ.. తమ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా వాట్సాప్‌ ద్వారా కూడా క్యాబ్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్‌ మాతృసంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated : 02 Dec 2021 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాబ్‌ సేవలు అందిస్తోన్న ఉబర్‌ క్యాబ్స్‌ సంస్థ.. తమ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా వాట్సాప్‌ ద్వారా కూడా క్యాబ్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్‌ మాతృసంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఉబర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌లోనే బిజినెస్‌ నంబర్‌కు మెసెజ్‌ చేసినా లేదా  క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినా నేరుగా ఉబర్‌ చాట్‌బాట్‌ ఓపెన్‌ అవుతోంది. అందులో ప్రయాణికులు ఎక్కే చోటు, దిగాల్సిన చోటు వివరాలు నమోదు చేసి క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లోనే యూజర్‌ రిజిస్ట్రేషన్‌, క్యాబ్‌ బుకింగ్స్‌, ప్రయాణాలకు సంబంధించిన రశీదులు వంటి వివరాలు పొందొచ్చు. యాప్‌లో ఉండే సేవలు.. సదుపాయాలన్నీ వాట్సాప్‌ బుకింగ్‌లోనూ ఉంటాయని  సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ వాట్సాప్‌ ఉబర్‌ బుకింగ్‌ను లఖ్‌నవూలో ప్రారంభించారు. త్వరలో దేశమంతా విస్తరింపజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఇప్పుడు ఆంగ్ల భాషలోనే బుకింగ్‌కు వీలుండగా.. రానున్న కాలంలో ప్రాంతీయ భాషల్లోనూ బుకింగ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని