ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. సంస్థ‌తో ప‌ని లేకుండానే యూఏఎన్‌ పొందే స‌దుపాయం

ఏ ఉద్యోగి అయిన యూఏఎన్ నెంబ‌రును నేరుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ నుంచి పొంద‌వ‌చ్చు......

Updated : 01 Jan 2021 17:33 IST

ఉద్యోగి భ‌విష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు శుభ‌వార్త తెలిపింది. అధికారిక రంగ కార్మికులు, వారి సంస్థ‌తో ప‌నిలేకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా యూనివ‌ర్స‌ల్ అక్కౌంట్ నెంబ‌రు(యూఏఎన్‌) పొందే స‌దుపాయాన్ని శుక్ర‌వారం ప్రారంభించింది.

ప్ర‌స్తుతం ఉద్యోగులు యూఏఎన్ కోసం వారు ప‌నిచేస్తున్న సంస్థ‌ను సంప్ర‌దించవ‌ల‌సి వ‌స్తుంది. ఉద్యోగి జీవితం కాలం పాటు ఒకే యూఏఎన్ నెంబ‌రు ఉంటుంది. ఈ నెంబ‌రుతో ఉద్యోగం మారిన ప్ర‌తిసారి పీఎఫ్ ట్రాన్స్‌ఫ‌ర్ క్లెయిమ్‌తో సంబంధం లేకుండా పీఎఫ్‌ను కొత్త సంస్థ‌కు బ‌దిలీ చేసుకోవ‌చ్చు.

అంతేకాకుండా ఎంప్లాయి ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్, త‌మ 65 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల కోసం మ‌రో కొత్త స‌దుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇక‌పై పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌(పీపీఓ) వంటి పింఛన్‌ సంబంధిత పత్రాలను డిజిలాకర్‌లో పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది.

వ్యక్తిగత పింఛనుదారులకు అందుబాటులో ఉండే విధంగా డిపాజిట‌రీ ఎల‌క్ట్రానిక్ పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ రూపొందించేందుకు ఈపీఎఫ్ఓ, నేష‌న‌ల్ ఇ-గ‌వ‌ర్నెన్స్ డివిజ‌న్‌(ఎన్ఇజీడీ)తో క‌లిసి ప‌నిచేస్తుంది. కాగిత రహిత వ్య‌వ‌స్థ దిశ‌గా ఈపీఎఫ్ఓ వేసిన ముంద‌డుగా దీనిని చెప్పుకోవ‌చ్చు.

ఈపీఎఫ్ఓ 67వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వ‌ర్ ఈ రెండు కొత్త స‌దుపాయాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అంతేకాకుండా ఈపీఎఫ్ఓ య‌జ‌మానుల‌ కోసం ఇ-ఇన్స్‌పెన్ష‌న్‌(డిజిట‌ల్ ఇంట‌ర్‌ఫేజ్‌) స‌దుపాయాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్టారు.

ఒక ఉద్యోగికి ఒకే యూఏఎన్ నెంబ‌రు ఉండాలి. అందువ‌ల్ల మీరు పాత సంస్థ నుంచి కొత్త సంస్థ‌కు మారిన‌న‌ప్పుడు కొత్త సంస్థ‌కు మీ పాత యూఏఎన్ నెంబ‌రు తెలియ‌జేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఈపీఎఫ్ఓలో 6 కోట్ల‌కు పైగా చందాదారులు ఉన్నారు. సుమారు రూ. 12.7 ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ను ఈపీఎఫ్ఓ నిర్వ‌హిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని