UPI volume cap: ఫోన్‌పే, గూగుల్‌పేకు ఊరట.. ఆ గడువు మరో రెండేళ్లు పెంపు

UPI లావాదేవీలపై పరిమితికి సంబంధించి ఫోన్‌పే (Phonepe), గూగుల్‌ పే (Google pay)కు ఊరట లభించింది. సంబంధిత గడువును NPCI మరో రెండేళ్లు పొడిగించింది.

Published : 03 Dec 2022 01:21 IST

దిల్లీ: యూపీఐ (UPI) లావాదేవీల్లో గూగుల్‌కు చెందిన గూగుల్‌పే (Google Pay), వాల్‌మార్ట్‌ చెందిన ఫోన్‌పే (PhonePe)దే హవా. దేశంలో జరుగుతున్న లావాదేవీల్లో ఈ రెండింటి వాటానే అధికం. ఈ వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు 30 శాతం పరిమితి నిబంధనను తీసుకొచ్చిన నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (NPCI) దాని అమలు గడువును 2024 డిసెంబర్‌కు వాయిదా వేసింది. దీంతో ఆ రెండు కంపెనీలకు ఊరట లభించినట్లయ్యింది.

మొత్తం యూపీఐ లావాదేవీల్లో గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్లు (TPAP)లు ఏవీ 30 శాతానికి మించి వాటా ఉండకూడదని ఎన్‌పీసీఐ 2020లో నిర్ణయిచింది. ఈ నిబంధన 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దశలవారీగా దీన్ని అమలు చేసేందుకు ఆయా యాప్‌ ప్రొవైడర్లకు రెండేళ్ల గడువు ఇచ్చింది. తాజాగా గడువును మరో రెండేళ్లపాటు పొడిగించింది. అదే సమయంలో డిజిటల్‌ పేమెంట్లలో గణనీయమైన వృద్ధికి అవకాశం ఉన్న వేళ కొత్త ప్లేయర్లు ప్రజలకు చేరువయ్యే మార్గాలను అన్వేషించాలని ఎన్‌పీసీఐ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని