Published : 13 Aug 2022 12:56 IST

NPS చందాదారుల‌కు అల‌ర్ట్‌.. ఇక‌పై UPI ద్వారా పేమెంట్స్

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ఎన్‌పీఎస్ (NPS) చందాదారులా? అయితే, ఇక‌పై మీ పెట్టుబ‌డుల‌ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేజ్‌ (UPI) ద్వారా కూడా చేయొచ్చు. చందాదారులకు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు పెన్ష‌న్ ఫండ్ నియంత్ర‌ణ‌, అభివృద్ధి సంస్థ (PFRDA) తెలిపింది. ప్ర‌స్తుతం చందాదారులు ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌ మాధ్యమాలైన‌ IMPS, NEFT, RTGS ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు దేశీయ ఇన్‌స్టంట్‌ రియ‌ల్-టైమ్ పేమెంట్స్ సిస్ట‌మ్‌ UPI ద్వారా కూడా చందాదారులు మ‌రింత సుల‌భంగా, వేగంగా, స‌ర‌ళంగా పెట్టుబ‌డులు పెట్టొచ్చు.

ఇందుకోసం యూపీఐ హ్యాండిల్‌ (PFRDA.15digitVirtualAccount@axisbank)ను కొత్త‌గా అందుబాటులోకి తెచ్చారు. అలాగే డీ-రెమిట్ వర్చువ‌ల్ అకౌంట్, అనుబంధిత శాశ్వత ఖాతా సంఖ్య (PRAN)కి భిన్నంగా ఉంటుంది. ఇది 6001 లేదా 6002 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని పీఎఫ్ఆర్‌డీఏ తెలియజేసింది. అలాగే, టైర్ I & II ఖాతాల‌కి కూడా డీ-రెమిట్ వర్చువల్ ఖాతా సంఖ్య వేరు వేరుగా ఉంటుంది. ఈ యూపీఐ ఫీచ‌ర్ ద్వారా ఖాతాదారులు NPS స్కీమ్ పెట్టుబ‌డుల‌ను ఒకే రోజులో పూర్తిచేయొచ్చు.

డీ-రెమిట్ కాంట్రిబ్యూష‌న్లు ట్ర‌స్టీ బ్యాంక్ ఉద‌యం 09:30 ముందే స్వీక‌రించిన‌ట్ల‌యితే అదే రోజు పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లుగా ప‌రిగ‌ణిస్తారు. ఒక‌వేళ ఉద‌యం 09:30 త‌ర్వాత కాంట్రిష‌న్ల‌ను ట్ర‌స్టీ బ్యాంక్ స్వీక‌రిస్తే వాటిని త‌ర్వాతి రోజు పెట్టుబ‌డులుగా ప‌రిగ‌ణిస్తార‌ని పీఎఫ్ఆర్‌డీఏ మార్గ‌ద‌ర్శకాల‌లో తెలిపింది. అంతే కాకుండా యూపీఐ హ్యాండిల్ పిరియాడిక‌ల్ (నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధవార్షిక‌.. మొద‌లైన‌) ఆటో డెబిట్ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది.

డీ-రెమిట్ కింద కాంట్రిబ్యూట్‌ చేసే క‌నీస మొత్తం రూ.500 లేదా అంత‌కంటే ఎక్కువ ఉండాలి. అందువ‌ల్ల యూపీఐ ఆధారిత డిపాజిట్లు రూ.500 కంటే తక్కువ ఉంటే వాటిని ఆమోదించ‌రు. ట్ర‌స్టీ బ్యాంకుకి తిరిగి పంపిస్తారు. ఒక‌వేళ చందాదారులు స్తంభించిన/క్రియారహితంగా ఉన్న ప్రాన్‌ల కోసం కాంట్రిబ్యూట్ చేసిన‌ట్లు సెంట్ర‌ల్ రికార్డు కీపింగ్ ఏజ‌న్సీ (CRA) నిర్ధారిస్తే అటువంటి చెల్లింపుల‌ను కూడా తిరిగి ట్రస్టీ బ్యాంకుకి పంపిస్తారు.

యూపీఐ హ్యాండిల్ వినియోగం ఇలా..

  • స్టెప్ - 1: ముందుగా సీఆర్‌ఏ సిస్ట‌మ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే E-NPS పేజీని ఓపెన్ చేయండి.
  • స్టెప్‌ - 2: ప్రాన్ నంబ‌రు వెరిఫై చేసేందుకు ఇక్క‌డ ప్రాన్ నంబ‌రు, పుట్టిన తేదీ త‌దిత‌ర వివరాలను ఇచ్చి వెరిఫై పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ - 3: మీ మొబైల్‌ నంబ‌రు/ఈ-మెయిల్ ఐడీకి ఓటీపీ వ‌స్తుంది. దాన్ని స‌బ్మిట్ చేయాలి.
  • స్టెప్ - 4: మీరు టైర్ I లేదా టైర్ II ఖాతాల‌లో దేనికి వర్చువ‌ల్ అకౌంట్‌ను కావాలనుకుంటున్నారో ఎంచుకోండి.
  • స్టెప్ - 5: ఇక్క‌డ ఇచ్చిన వివ‌రాల‌ను పూర్తిగా చ‌దివి మీ స‌మ్మ‌తి తెలియ‌జేయండి. 
  • స్టెప్ - 6: ఆ త‌ర్వాత జన‌రేట్ వర్చువ‌ల్ అకౌంట్‌పై క్లిక్ చేయాలి. ఇది పూర్తి చేసిన త‌ర్వాత మీ అభ్య‌ర్థ‌న ట్ర‌స్టీ బ్యాంకుకి ఫార్వ‌ర్డ్ అవుతుంది. ఇక్క‌డ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబ‌ర్‌ కనిపిస్తుంది. టైర్ I, టైర్ II ఖాతాల‌కు విడివిడిగా నంబ‌రు జనరేట్‌ అవుతుంది.
  • స్టెప్ - 7: ప్రాన్‌కి నిధుల‌ను పంపించ‌డం కోసం యూపీఐ హ్యాండిల్లో 15 అంకెల వర్చువ‌ల్ అకౌంట్ నంబ‌రును ఇక్కడ తెలిపిన ఫార్మాట్‌ PFRDA.15digitVirtualAccount@axisbankలో న‌మోదు చేయాలి.
  • స్టెప్ - 8: ఏదైనా ప‌నిదినాల్లో ఉద‌యం 9:30లోపు నిధుల‌ను పంపితే అదే రోజు NAV (నెట్ ఎసెట్ వాల్యూ)తో లెక్క‌లోకి తీసుకుంటారు. ఒక‌వేళ ఉద‌యం 9:30 దాటిన త‌ర్వాత అయితే, త‌ర్వాతి రోజు పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు చూపిస్తుంది.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని