ఎన్‌పీఎస్ విత్‌డ్రాయ‌ల్ కోసం ఏం చేయాలి?

సాధార‌ణంగా పెట్టుబ‌డిదారుడికి 60 ఏళ్లు వచ్చిన త‌ర్వాత మాత్ర‌మే టైర్‌-1 ఖాతాలోని డ‌బ్బును విత్‌డ్రా చేసేందుకు వీలుంటుంది...

Published : 18 Dec 2020 17:19 IST

సాధార‌ణంగా పెట్టుబ‌డిదారుడికి 60 ఏళ్లు వచ్చిన త‌ర్వాత మాత్ర‌మే టైర్‌-1 ఖాతాలోని డ‌బ్బును విత్‌డ్రా చేసేందుకు వీలుంటుంది.​​​​​​​

https://cra-nsdl.com/CRA/ ద్వారా చందాదారులు ఎన్‌పీఎస్ విత్‌డ్రాయ‌ల్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌వ‌చ్చు.

ప‌రిమితులు:

సాధార‌ణంగా పెట్టుబ‌డిదారుడికి 60 ఏళ్లు వచ్చిన త‌ర్వాత మాత్ర‌మే టైర్‌-1 ఖాతాలోని డ‌బ్బును విత్‌డ్రా చేసేందుకు వీలుంటుంది. ఒక్క‌సారిగా గ‌రిష్టంగా 20 శాతం సొమ్మును మాత్ర‌మే వెన‌క్కి తీసుకునేందుకు అవ‌కాశం ఉంది.

యాన్యుటీ కొనుగోలు:

పెట్టుబ‌డిదారుడు 60 ఏళ్ల కంటే ముందు మొత్తం సొమ్ములో 20 శాతాన్ని తీసుకుంటే, మిగిలిన 80 శాతాన్ని యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసేందుకై వినియోగించాల్సి ఉంటుంది. ఈ 80 శాతం డబ్బును 60 ఏళ్ల కంటే ముందు తీసుకునేందుకు వీలుప‌డ‌దు.

ప‌ద‌వీ విర‌మ‌ణ‌:

60 ఏళ్లు వ‌చ్చిన త‌ర్వాత పెట్టుబ‌డిదారు గ‌రిష్టంగా 60 శాతం డ‌బ్బును, ఏక‌మొత్తంగా లేదా వాయిదాల రూపంలో తీసుకోవ‌చ్చు. మిగిలిన సొమ్ముతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

చందాదారుడు మ‌ర‌ణిస్తే:

60 ఏళ్ల కంటే ముందు పెట్టుబ‌డిదారు మ‌ర‌ణిస్తే, ఖాతాలోని సొమ్మును నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ద‌వార‌సులు క్లెయిం చేసి ఒక్క‌సారిగా అంత మొత్తాన్ని తీసుకునేందుకు వీలుంది.
నామినీ కావాల‌నుకుంటే కేవైసీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వివ‌రాలు స‌మ‌ర్పించి ఎన్‌పీఎస్ ఖాతాను కొన‌సాగించుకోవ‌చ్చు.

సమర్పించాల్సిన డాక్యుమెంట్లు:

  • పూర్తి వివరాలతో నింపిన విత్‌డ్రాయల్‌ ఫారం
  • విత్‌డ్రాయల్‌ ఫారంతోపాటు కవరింగ్‌ లెటర్‌
  • రెవెన్యూ స్టాంపు అతికించిన రశీదు. స్టాంపుపై ఎన్‌పీఎస్‌ సభ్యుడి సంతకం
  • ఒరిజినల్‌ శాశ్వత రిటైర్మెంట్‌ ఖాతా సంఖ్య (ప్రాన్‌ కార్డు). ప్రాన్‌ కార్డు జతచేయలేకపోతే అందుకు కారణాలను పేర్కొంటూ అఫిడవిట్‌ సమర్పించాలి.
  • కేవైసీ డాక్యుమెంట్లు (చిరునామా, గుర్తింపు కార్డులు)
  • సభ్యుడి పేరు, బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కలిగి ఉన్న క్యాన్సిల్డ్‌ చెక్కు (లేదా) సభ్యుడి ఫొటో సంతకం కలిగి ఉన్న పాస్‌బుక్‌ కాపీ (లేదా) సభ్యుడి పేరు, అకౌంట్‌ నెంబరుతో బ్యాంకు జారీచేసే ధ్రువీకరణ పత్రం
  • ఎన్‌పీఎస్‌ సభ్యుడు మృతిచెందినట్టయితే స్థానిక అధికారులు జారీచేసిన ఒరిజినల్ మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • నామినీ వివరాలు సీఆర్‌ఏ వద్ద అందుబాటులో లేనప్పుడు … చట్టబద్ధ వారసత్వ సర్టిఫికెట్‌ సమర్పించాలి.

వ్య‌క్తిగ‌త గుర్తింపు:

  • పాస్‌పోర్టు
  • ఫోటోతో కూడిన రేష‌న్‌కార్డు
  • బ్యాంక్ పాస్‌బుక్
  • ఓట‌రు గుర్తింపు కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్‌కార్డు
  • ఆధార్ కార్డు
  • ఎంపీ లేదా ఎంఎల్ఏ సంత‌కం చేసిన వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం
  • ఉపాధి హామీ జాబ్‌కార్డు
  • ప్ర‌భుత్వం, ర‌క్ష‌ణ‌, పారామిలిట‌రీ, పోలీసు డిపార్ట్‌మెంట్ జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డు
  • ర‌క్ష‌ణ శాఖ జారీ చేసే ఎక్స్ స‌ర్వీస్‌మెన్ కార్డు
  • ఫోటో క్రెడిట్ కార్డు

చిరునామా గుర్తింపు:

  • పాస్‌పోర్టు
  • ఫోటోతో కూడిన రేష‌న్‌కార్డు
  • బ్యాంక్ పాస్‌బుక్
  • ఓట‌రు గుర్తింపు కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఆధార్ కార్డు
  • గెజిటెడ్ ఆఫీస‌ర్ నుంచి లెట‌ర్‌
  • ఎంపీ లేదా ఎంఎల్ఏ సంత‌కం చేసిన చిరునామా గుర్తింపు ప‌త్రం
  • ఉపాధి హామీ జాబ్‌కార్డు
  • చందాదారుడి పేరిట ఉన్న విద్యుత్ లేదా నీటి బిల్లు
  • ఇటీవ‌లి టెలిఫోన్ బిల్లు

వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం స‌మ‌ర్పించిన ప‌త్రంలో ఖాతా తెరిచిన‌ప్పుడు ఇచ్చిన చిరునామా ఉంటే, అటువంటి దాన్ని వ్య‌క్తిగ‌త‌, చిరునామా గుర్తింపు కోసం అంగీక‌రిస్తారు.
ప్ర‌స్తుతం నివ‌సించే చిరునామా ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు ఇచ్చిన చిరునామా ఒక‌టే కానీ సంద‌ర్భంలో వేరే చిరునామా గుర్తింపు ప‌త్రాన్ని ఇవ్వాలి.

ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయ‌ల్ కోసం అభ్య‌ర్థించేట‌ప్పుడు 100 శాతం తీసుకునేందుకు వీలుండ‌దు.

పాక్షిక విత్‌డ్రాయ‌ల్‌:

చందాదారుడు త‌న ఖాతాలో నుంచి విత్‌డ్రా చేసుకునేట‌ప్పుడు విత్‌డ్రాయ‌ల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసేందుకు 25 శాతం కంటే ఎక్కువ తీసుకునేందుకు అనుమ‌తించ‌రు. కింది కార‌ణాలు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

ఏ) పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం
బి) పిల్ల‌ల వివాహ ఖ‌ర్చుల కోసం
సి) చందాదారుడి పేరిట ఇల్లు క‌ట్టుకునేందుకు
డి) కొన్ని నిర్దేశిత వ్యాధుల చికిత్స‌ల కొర‌కు: -

చందాదారుడు లేదా వారి జీవిత భాగ‌స్వామి లేదా పిల్ల‌లు ఏదైనా వ్యాధితో బాధ‌ప‌డుతూ ఉన్న‌ప్పుడు వారి ఆస్ప‌త్రి ఖ‌ర్చుల కోసం ఎన్‌పీఎస్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

  • క్యాన్స‌ర్‌
  • కిడ్నీ విఫ‌ల‌మ‌వ్వ‌డం
  • ప్రైమ‌రీ ప‌ల్మ‌న‌రీ ఆర్టిరియ‌ల్ హైప‌ర్‌టెన్ష‌న్‌
  • మ‌ల్టిపుల్ స్క్లెరోసిస్‌
  • ముఖ్య అవ‌య‌వాల మార్పిడి
  • క‌రోన‌రీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్‌
  • అరోటా గ్రాఫ్ట్ స‌ర్జ‌రీ
  • హార్ట్ వాల్వ్ స‌ర్జ‌రీ
  • స్ట్రోక్‌
  • మ‌యోకార్డియ‌ల్ ఇన్‌ఫ్రాక్ష‌న్‌
  • కోమా
  • పూర్తి అంధ‌త్వం
  • ప‌క్ష‌వాతం

ప్రాణాల‌కు ప్ర‌మాదం జరిగే రీతిలో జ‌రిగే యాక్సిడెంట్ విష‌యంలో పీఎఫ్ఆర్‌డీఏ స‌మ‌యానుసారంగా ప్ర‌క‌టించే ఇత‌ర వ్యాధుల కోసం.

ఎన్‌పీఎస్ విత్‌డ్రాయ‌ల్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేందుకు గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణాలు:

  • కేవైసీ ప‌త్రాలపై అటెస్టేష‌న్ లేకుండా ఉంటే
  • విత్‌డ్రాయ‌ల్ ఫారంతో పాటుగా ఓరిజిన‌ల్ ప్రాన్ కార్డు లేదా అఫిడ‌విట్‌ను అంద‌జేయ‌న‌ప్పుడు
  • పీవోపీ క‌వ‌రింగ్ లెట‌ర్‌లో ఉన్న ప‌ద‌వీ విర‌మ‌ణ తేదీతో స‌రిపోల‌క‌పోతే
  • విత్‌డ్రాయ‌ల్ ఫారంతో పాటుగా పీవోపీ క‌వ‌రింగ్ లెట‌ర్ స‌మ‌ర్పించ‌న‌ప్పుడు
  • విత్‌డ్రాయ‌ల్ ఫారంను పీవోపీ ధ్రువీక‌రించ‌ని సంద‌ర్భంలో
  • విత్ డ్రాయ‌ల్ ఫారం నందు విత్‌డ్రాయ‌ల్ ఫండ్ కేటాయింపు శాతాన్ని పేర్కొన‌కుండా ఉన్న‌ప్పుడు
  • నామినేష‌న్ ఫారంలో నామినీ వివ‌రాలు లేకుండా ఉంటే
  • విత్‌డ్రాయ‌ల్ ఫారంలో ఉన్న చిరునామాతో, చిరునామా రుజువుగా స‌మ‌ర్పించిన దానిలో ఉన్న అడ్ర‌స్ ఒక‌టే కాన‌ప్పుడు
  • విత్‌డ్రాయ‌ల్ ఫారంలో ఉన్న పేరు, కేవైసీ ప‌త్రాల్లో ఉన్న పేరు వేర్వేరుగా ఉన్న సంద‌ర్భంలో
    చందాదారుడు / క్లెయిందారుడు ఫోటోపై స్వ‌యం ధ్రువీక‌ర‌ణ చేయ‌క‌పోతే
  • చందాదారుడు చ‌నిపోయినప్పుడు నామినీ సెంట్ర‌ల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) సూచించిన విధంగా విత్‌డ్రాయ‌ల్ అభ్య‌ర్థ‌న‌ను స‌మ‌ర్పించ‌న‌ప్పుడు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని