NRIs: భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి వైపు ఆసక్తి చూపిస్తున్న ఎన్నారైలు

ఎన్‌ఆర్‌ఐలు భారతీయ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, దీనికి గల కారణాలేంటో ఇక్కడ చూడండి. 

Published : 01 Feb 2023 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్నేళ్ల నుంచి ఎన్నారైలు స్వదేశంలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీల్లో ఎక్కువ సంఖ్యలో పెట్టుబడులు పెడుతున్నారు. కొవిడ్‌ పరిణామాలు భారత్‌లో ఆస్తులను సొంతం చేసుకోవాలనే ఆకాంక్షను ఎన్నారైలలో ప్రేరేపించాయి. 2020 అనంతరం భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీలలో ఎక్కువ సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి.. భారతీయ రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన దృఢమైన దృక్పథంతో కలిసి వారిని స్వదేశం వైపు తిరిగేలా చేస్తోంది. అంతేకాకుండా రూపాయి విలువ క్షీణించడం, డాలరు మరింత బలపడడం మూలంగా (డాలరుకు ఎక్కువ రుపాయిలు రావడం) పెట్టుబడులను మరింత లాభదాయకంగా చేస్తోంది.

ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం.. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్‌, ఉత్తర అమెరికా వంటి వివిధ ప్రాంతాల్లో  1.70 కోట్ల మంది భారతీయులు విస్తరించి ఉన్నారు. ప్రతి సంవత్సరం, ఈ భారతీయ పెట్టుబడిదారులు గణనీయమైన భాగం పెట్టుబడి కోసం భారతీయ రియల్‌ ఎస్టేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 2019 నివేదికల ప్రకారం ఈ రంగంపై ఎన్‌ఆర్‌ఐ కొనుగోళ్లు 11 బిలియన్‌ డాలర్లు. అప్పటి నుంచి ఈ వర్గం పెట్టుబడులలో పెరుగుదల ధోరణి కనిపించింది. 2022లో ఇది దాదాపు 14-15 బిలియన్‌ డాలర్లు ఉంటుందని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఈ కారణాలే కాకుండా స్థిరాస్తి ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, పారదర్శకత, స్థిరమైన ఆదాయం కూడా ఎన్‌ఆర్‌ఐలు భారతీయ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని