Crude oil: ఒపెక్‌ సమావేశం వేళ క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా 90 డాలర్ల దిగువన ట్రేడవుతూ వస్తున్న క్రూడాయిల్‌ ధర మరోసారి పెరిగింది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 91.91 డాలర్లకు చేరింది.

Updated : 17 Oct 2022 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా 90 డాలర్ల దిగువన ట్రేడవుతూ వస్తున్న క్రూడాయిల్‌ ధర మరోసారి పెరిగింది. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 91.91 డాలర్లకు చేరింది. గత సెషన్‌తో పోలిస్తే 2.94 డాలర్లు పెరిగింది. యూఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్‌ ధర కూడా 5 శాతం పెరిగి 86.57 డాలర్లకు చేరింది. గత ముగింపుతో పోలిస్తే ఇది కూడా 2.89 శాతం మేర ఎగిసింది. చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్‌+ దేశాలు సమావేశం అవుతుండడం ఇందుకు నేపథ్యం.

రష్యా సహా ఇతర చమురు ఎగుమతి దేశాలతో కూడిన ఒపెక్‌+ బుధవారం సమావేశం కానుంది. అంతర్జాతీయంగా చమురు ధరలను స్థిరీకరించేందుకు ఈ బృందం ఉత్పత్తిలో కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020 కొవిడ్‌ మహమ్మారి సమయంలోనే ఆ దేశాలు ఉత్పత్తిలో భారీ కోత విధించాయి. ఇప్పుడు సైతం రోజుకి 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఆ దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రపంచ ఆర్థికానికి.. చమురు ఉత్పత్తిలో కోత విధిస్తే పెద్ద దెబ్బేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చమురు ఉత్పత్తి తగ్గిస్తే ఆ మేర ధరలు పెరిగి అమెరికా సహా ఇతర చమురు దిగుమతి దేశాలపై ఈ ప్రభావం పడనుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని