Gas Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు కాస్త ఊరట లభించే వార్త చెప్పాయి.

Updated : 01 Jun 2023 10:45 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరను (Commercial LPG cylinder price) చమురు సంస్థలు సవరించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹83.50 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ₹1,773కు దిగొచ్చింది. కొత్త ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత మూడు నెలల వ్యవధిలో వాణిజ్య సిలిండర్ ధర (Commercial LPG cylinder price) మూడు సార్లు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని