Ukraine Crisis: ఉక్రెయిన్‌పై దాడితో భగ్గుమన్న చమురు ధర

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్‌ ఆదేశించడంతో అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావం చూపించింది. ముడిచమురు ధర ఒక్కసారి భగ్గుమంది.

Published : 24 Feb 2022 11:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు పుతిన్‌ ఆదేశించడం అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావం చూపించింది. ముడిచమురు ధర ఒక్కసారి భగ్గుమంది. దాదాపు ఏడేళ్ల తర్వాత పీపా చమురు ధర 100 డాలర్లను దాటేసింది. ఆసియా స్టాక్‌ మార్కెట్లు మొత్తం 2 నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపులు మొదలైన నాటి నుంచి చమురు ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి.

 ఈ క్రమంలో ఏడేళ్లలో అత్యధికంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారల్‌కు 100 డాలర్ల స్థాయికి చేరింది. మార్కెట్‌ ఇన్వెస్టర్లు వేగంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే బంగారం, డాలర్లు, జపాన్‌ యెన్‌ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రష్యా చర్యలపై పశ్చిమ దేశాల స్పందనల ఆధారంగా చమురు ధరల్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని