Ola Electric Holi offers: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై హోలీ ఆఫర్లు

Ola Electric Holi offers: హోలీ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1, ఎస్‌1 ప్రో మోడళ్లపై ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది.

Published : 08 Mar 2023 15:43 IST

హైదరాబాద్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను (Ola Electric Holi offers) ప్రకటించింది. ఎస్‌1 (Ola S1) మోడల్‌పై రూ.2,000, ఎస్‌1 ప్రో (Ola S1 pro)పై రూ.4,000 వరకు అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

మరోవైపు ఇప్పటికే ఉపయోగిస్తున్న పెట్రోల్‌ ద్విచక్రవాహనంపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ.45,000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. తాజాగా హోలీ ప్రయోజనాలు దీనికి అదనం. అలాగే ఓలా ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మరో రూ.6,999 వరకు ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి 8 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటాయి.

ఈ నెల 11, 12 తేదీల్లో ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లలో ఎస్‌1, ఎస్‌1 ప్రో స్కూటర్లను కొనే వారికి ఓలా కేర్‌+ సబ్‌స్క్రిప్షన్లలో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఓలా కేర్‌+లో ఫ్రీ లేబర్‌ ఆన్‌ సర్వీస్‌, థెఫ్ట్‌ అసిస్టెన్స్‌ హెల్ప్‌లైన్‌, పంక్చర్‌ అసిస్టెన్స్‌ వంటి ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు వార్షిక సమగ్ర వాహన చెకప్‌, ఉచిత కన్జ్యూమబుల్స్‌, 24/7 డాక్టర్‌ అండ్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ వంటి ప్రయోజనాలను కూడా పొందొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు