Ola scooter: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల డెలివ‌రీ షురూ.. ఈ రాష్ట్రంలోనే చవక!

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల బుకింగ్ విష‌యంలో మొద‌టి నుంచి సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డెలివ‌రీలు డిసెంబ‌ర్ 15 నుంచి ప్రారంభం అయ్యాయి. 

Updated : 15 Dec 2021 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల బుకింగ్ విష‌యంలో మొద‌టి నుంచి సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డెలివ‌రీలు డిసెంబ‌ర్ 15 నుంచి ప్రారంభం అయ్యాయి.  ఎస్‌1, ఎస్‌1 ప్రో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లు రూ. 99,999, రూ. 1,29,999గా ఉండ‌గా.. అధికారికంగా విడుదల చేసిన 4 నెల‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు వీటి డెలివరీలను ఓలా ప్రారంభించింది. ఈ స్కూట‌ర్లు లాంచ్ కాక‌ముందే కేవ‌లం 24 గంట‌ల్లోనే ఒక ల‌క్ష‌కు పైగా ప్రీ-బుక్ అయ్యాయి. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల డెలివ‌రీలు ఆలస్యం జరిగిన విషయం తెలిసిందే. కంపెనీ బెంగళూరులో మొద‌టి 50 మంది వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేక డెలివ‌రీ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హిస్తోంది.

4.40 - 6.30 గంట‌ల్లో స్కూట‌ర్‌ బ్యాట‌రీలు పూర్తి ఛార్జ్‌ అవుతాయి. పోర్ట‌బుల్ హోమ్ చార్జ‌ర్ కూడా డెలివ‌రీ సమయంలో ఇస్తారు. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో గంట‌కు 90 కి.మీ, 115 కి.మీ గ‌రిష్ఠ వేగంతో వెళతాయి. ఈ స్కూట‌ర్ల ధ‌ర‌లు ఫేమ్‌-II స‌బ్సిడీతో స‌హా ఎక్స్‌-షోరూమ్ ధ‌ర‌లు రాష్ట్రాలు ఇచ్చే స‌బ్సిడినీ బ‌ట్టి మారే (త‌గ్గే) అవ‌కాశ‌ముంది. మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే గుజ‌రాత్‌లో ఈ స్కూట‌ర్ ధ‌ర‌లు అత్య‌ల్పంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రకటించిన ధరలు దిగువ టేబుల్‌లో ఇస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని