Ola Electric: అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్‌ ఎంట్రీ

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌ తన మార్కెట్‌ను విస్తరించాలనుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం తన విద్యుత్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

Published : 22 Sep 2022 19:11 IST

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) తన మార్కెట్‌ను విస్తరించాలనుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం తన విద్యుత్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. పొరుగు దేశమైన నేపాల్‌లో తొలుత అడుగు పెట్టబోతోంది. ఇందులో భాగంగా ఓలా ఎస్‌1 స్కూటర్ల విక్రయానికి నేపాల్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే త్రైమాసికం నుంచి నేపాల్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

తదుపరి దశలో లాటిన్‌ అమెరికా, ఆసియాన్‌, యూరోపియన్‌ యూనియన్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశించాలని ఓలా ఎలక్ట్రిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. తమ వ్యాపార విస్తరణ ద్వారా ఇతర దేశాల్లో కస్టమర్లకు సేవలందించడమే కాకుండా ఈవీ విప్లవంలో ప్రపంచ దేశాలకు భారత్‌ను లీడర్‌గా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని