OLA: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి ఓలా నిష్క్రమణ

ఓలాలో క్యాబ్‌/ఆటో/బైక్‌ బుక్‌ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్‌ రూపంలో మనకు కనిపిస్తుంటాయి.

Published : 07 Jul 2024 01:54 IST

సొంత మ్యాప్స్‌తో సిద్ధం

ఓలాలో క్యాబ్‌/ఆటో/బైక్‌ బుక్‌ చేసుకుంటే.. గమ్యస్థానాన్ని చేరే మార్గం, సమయం తదితరాలు మ్యాప్‌ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. ఇందు కోసం గూగుల్‌ మ్యాప్స్‌ను ఓలా వినియోగించేది. అయితే తాజాగా సొంతంగా సిద్ధం చేసుకున్న ఓలా మ్యాప్స్‌కు మళ్లినట్లు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని తాజా సేవలను పొందొచ్చని వివరించారు. ‘గత నెలలో మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ నుంచి వైదొలగిన మేం.. ఇపుడు గూగుల్‌ మ్యాప్స్‌ నుంచీ నిష్క్రమించాం. ఏటా రూ.100 కోట్లను ఇందుకు ఖర్చుపెట్టేవాళ్లం. ఇపుడు సొంత మ్యాప్స్‌ కారణంగా మా ఖర్చు సున్నాకు చేరింద’ని అగర్వాల్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు. స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్, త్రీడీ మ్యాప్స్, డ్రోన్‌ మ్యాప్స్‌ తదితర ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఓలా ఎలక్ట్రిక్‌ సొంతంగా సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలనూ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి తన విద్యుత్‌ స్కూటర్లకు ఈ బ్యాటరీలనే వినియోగించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని