Ola: ఇకపై ఓలా సొంత మ్యాప్స్‌

Ola: ప్రముఖ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా తన సొంత మ్యాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై ఓలా వేదికగా గూగుల్‌ మ్యాప్స్‌ స్థానంలో వీటిని వినియోగించుకోవచ్చు.

Updated : 06 Jul 2024 20:25 IST

Ola | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ సేవల సంస్థ ఓలా (Ola).. గూగుల్ మ్యాప్స్ నుంచి పూర్తిగా నిష్క్రమించింది. అదే స్థానంలో తన సొంత మ్యాప్స్‌ను తీసుకొచ్చింది. అంటే ఇకపై ఓలా ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ రూపొందించిన మ్యాప్‌ వినియోగానికి అందుబాటులో రానున్నాయి. యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ (Bhavish Aggarwal) తెలిపారు. ఓలా ఇది వరకే మైక్రోసాఫ్ట్‌కి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు ఓలా రూట్‌ కోసం ఇతర మ్యాప్స్‌లపై ఆధారపడుతూ ఉండేది. దీని కోసం ఏటా రూ.100 కోట్లు వెచ్చించేది. అయితే ఓలా తీసుకొచ్చిన తాజా సేవల కారణంగా ఆ డబ్బు ఆదా కానుంది. ‘‘ సొంతంగా రూపొందించిన ఓలా మ్యాప్స్‌ను తీసుకొచ్చాం. యాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని ఈ మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు’’ అని అగర్వాల్‌ ‘‘ఎక్స్‌’’ వేదికగా పోస్ట్‌ చేశారు. సంబంధిత స్క్రీన్‌ షాట్‌ను పంచుకున్నారు.

జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న కేంద్ర బడ్జెట్‌

స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్‌, త్రీడి మ్యాప్స్‌, డ్రోన్‌ మ్యాప్స్‌.. తదితర ఫీచర్లు త్వరలోనే ఫీచర్లు ఓలా మ్యాప్స్‌లో అందుబాటులో తీసుకురానున్నట్లు ఓలా సీఈఓ వెల్లడించారు. కృత్రిమ్‌ (Krutrim) క్లౌడ్‌లో ఓలా మ్యాప్స్‌ ఏపీఐ అందుబాటులో ఉందని.. ఆసక్తి ఉన్న డెవలపర్లు తమ సొంత యాప్‌లలో దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఓలా తీసుకొచ్చిన మ్యాప్స్‌ గురించి మరిన్ని విషయాలను ప్రత్యేకంగా ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ రానున్న రోజుల్లో అందరికీ లభ్యం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని