Ola: 700 మంది ఉద్యోగులకు ఓలా మంగళం..? ఖర్చులు తగ్గించుకునేందుకే!

దేశంలో క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఓలా కంపెనీ (OLA) ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతోంది. వి

Published : 08 Jul 2022 15:04 IST

దిల్లీ: దేశంలో క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఓలా కంపెనీ (OLA) ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమవుతోంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 700 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలను ఓ గాడిన పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా విభాగాల అధిపతులకు లే ఆఫ్‌ వేయాల్సిన ఉద్యోగుల జాబితాను తయారు చేయాల్సిందిగా ఓలా సూచించినట్లు తెలుస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్‌ విభాగం ద్వారా ఇప్పటికే టూ వీలర్‌, కార్ల వ్యాపారంపై దృష్టి సారించింది. మరోవైపు గత నెలలో పాతకార్ల విభాగం ‘ఓలా కార్స్‌’ను, క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ ‘ఓలా డ్యాష్‌’ను మూసివేసింది. వీటితో పాటు లాభదాయకత లేదన్న కారణంతో ఓలా కేఫ్‌, ఫుడ్‌ పాండా, ఓలా ఫుడ్స్‌ను కూడా ఇప్పటికే మూసివేసింది. కేవలం ఓలా ఎలక్ట్రిక్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా మూసివేసిన వ్యాపారాలకు సంబంధించిన ఉద్యోగులను తొలగించేందుకు తాజాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని