OLX: ఓఎల్ఎక్స్‌లోనూ తొలగింపులు.. 1500 మందికి ఉద్వాసన!
ఓఎల్‌ఎక్స్ సంస్థ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 1500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. ఇందులో భారతీయులు సైతం ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద సంస్థల నుంచి స్టార్టప్‌ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను ఇంటికి (Layoffs)పంపిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే వేదికగా అందరికీ సుపరిచితమైన ఓఎల్‌ఎక్స్ గ్రూప్ (OLX) సైతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 10 వేల మంది పనిచేస్తుండగా.. అందులో 15 శాతం మంది అంటే దాదాపు 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఉన్నారు. అయితే, ఇందులో ఎంత మందిని తొలగిస్తున్నారనేది తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ తొలగింపులు చేపడుతున్నట్లు తెలిసింది.
ఓఎల్‌ఎక్స్ గ్రూప్ తొలగింపు నిర్ణయంతో కంపెనీ ఆటో బిజినెస్‌పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఇంజినీరింగ్, ఆపరేషన్స్ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులపైనా తొలగింపుల ప్రభావం ఉండబోతోందని తెలిపింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్‌ఎక్స్ ఈ నిర్ణయం తీసుకుందని ఓఎల్‌ఎక్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భవిష్యత్ ఆశయాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఓఎల్‌ఎక్స్ గ్రూప్ భారత్‌లో 2009లో అడుగు పెట్టింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయించే వేదికగా అనతికాలంలోనే ప్రజలకు చేరువైంది. ఇదే కంపెనీ 2020 జనవరిలో ఓఎల్‌ఎక్స్ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్ కార్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
Politics News
రాహుల్.. నేటి కాలపు మీర్ జాఫర్!.. భాజపా నేత సంబిత్ పాత్ర విమర్శ
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి