Idli: ఒకే ఒక్కరు.. ఏడాదిలో స్విగ్గీలో రూ.6లక్షల ఇడ్లీలు ఆర్డర్
ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఫుడ్ ఆర్డర్ చేసే వారిని చూస్తేనే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఏడాదిలో రికార్డు స్థాయిలో 8వేలకు పైగా ప్లేట్ల ఇడ్లీలను (Idlis) ఆర్డర్ చేశారట.
ఇంటర్నెట్ డెస్క్: ప్రాంతాన్ని బట్టి మన దేశంలో బ్రేక్‌ఫాస్ట్ వంటకాలు మారుతుంటాయి. అయితే, ఎన్ని రుచులున్నా దక్షిణాదిలో ‘ఇడ్లీ (Idli)’ చాలా పాపులర్ బ్రేక్‌ఫాస్ట్. రుచితో పాటు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది ఇడ్లీని అమితంగా ఇష్టపడుతారు. అందుకేనేమో ఓ వ్యక్తి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఈ వంటకాన్నే అత్యధికంగా ఆర్డర్ చేశారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.6లక్షల విలువ చేసే ఇడ్లీలను కొనుగోలు చేశారు. గురువారం (మార్చి 30) ‘ప్రపంచ ఇడ్లీ (Idlis) దినోత్సవాన్ని’ పురస్కరించుకుని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) ఈ వంటకంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది.
2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలంలో ఇడ్లీ (Idli) ఆర్డర్లపై అధ్యయనం చేసిన స్విగ్గీ ఈ నివేదికను తయారుచేసింది. ఈ 12 నెలల కాలంలో స్విగ్గీ 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందట. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఈ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఆ తర్వాత కోల్‌కతా, కోచి, ముంబయి, కొయంబత్తూర్, పుణె నుంచి కూడా ఇడ్లీ ఆర్డర్లు అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది.
ఇక, హైదరాబాద్‌కు చెందిన ఓ స్విగ్గీ (Swiggy) కస్టమర్ ఏడాది కాలంలో రూ.6లక్షల విలువ చేసే ఇడ్లీలను తమ వేదికపై ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఆ కస్టమర్ మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను (Idlis) స్విగ్గీలో కొనుగోలు చేశారని తెలిపింది. హైదరాబాద్ మాత్రమే గాక.. బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఆ వ్యక్తి ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. ఇక స్విగ్గీలో ఎక్కువ మంది మసాలా దోశను కొనుగోలు చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: ఐటీ అధికారుల ముసుగులో గోల్డ్ షాప్‌లో లూటీ.. దర్యాప్తులో కీలక విషయాలు
-
Movies News
BIG B: ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతూ.. తనను తాను నిందించుకున్న అమితాబ్
-
Politics News
Rahul Gandhi: మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే.. 150 స్థానాలు గెలుస్తామన్న రాహుల్ గాంధీ!
-
Movies News
2018 movie ott release date: ఓటీటీలో 2018 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Sports News
IPL Final: ఫైనల్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ.. నేడూ వరుణుడు ఆటంకం కలిగిస్తాడా?
-
General News
Niranjan reddy: దశాబ్ది ఉత్సవాలు.. చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి