OnePlus 11R 5G: వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ ప్రీ-ఆర్డర్‌ ప్రారంభం.. రూ.5,999 బడ్స్‌ ఫ్రీ!

OnePlus 11R 5G: వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది.

Published : 22 Feb 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిడ్‌ రేంజ్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ (OnePlus 11R 5G) ప్రీ-ఆర్డర్ బుకింగ్‌లు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. విక్రయాలు ఫిబ్రవరి 28న జరగనున్నాయి. ప్రీ-ఆర్డర్‌లో కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ లేదా అమెజాన్‌ ద్వారా ఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

ధర ఇలా..

వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ (OnePlus 11R 5G) మిడ్‌ రేంజ్‌ ప్రీమియం ఫోన్‌. దీంట్లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.39,999. 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.44,999.

ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్‌ కింద వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీని బుక్‌ చేసుకున్నవారికి రూ.1,000 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇదే ఆఫర్‌ సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకూ వర్తిస్తుంది. వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌ వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌, అమెజాన్‌ ద్వారా బుక్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ప్రీ-ఆర్డర్‌ సమయంలో బుక్‌ చేసుకున్నవారికి రూ.5,999 విలువ చేసే వన్‌ప్లస్‌ బడ్స్‌జెడ్‌2 బడ్స్‌ ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌నకు అనుసంధానమైన రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ డివైస్‌లో మరో రూ.2,000 అదనపు డిస్కౌంట్‌ లభించనుంది.

స్పెసిఫికేషన్లు..

  • 360Hz టచ్‌ రెస్పాన్స్‌ రేట్‌, HDR10+ కంపాటబిలిటీతో కూడిన 6.74 అంగుళాల 10 బిట్‌ AMOLED డిస్‌ప్లే. 
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 SoC
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 100వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • ట్రిపుల్‌ కెమెరా. OIS సపోర్ట్‌తో కూడిన IMX890 సెన్సర్‌ కలిగిన 50ఎంపీ సోనీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్‌. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా ఉంది.
  • 5జీలో n1/n3/n5/n8/n28A/n40/n41/n77/n78 బ్యాండ్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది.
  • గేలక్టిక్‌ సిల్వర్‌, సోనిక్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని