OnePlus festive sale: టీవీ, మొబైళ్లపై వన్‌ప్లస్‌ ఆకర్షణీయ ఆఫర్లు..

చైనా టెక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సెప్టెంబరు 22న ప్రారంభించిన ఫెస్టివ్‌ సేల్‌ కొనసాగుతోంది. టీవీలు, మొబైళ్లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది....

Published : 26 Sep 2022 00:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా టెక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ సెప్టెంబరు 22న ప్రారంభించిన ఫెస్టివ్‌ సేల్‌ కొనసాగుతోంది. టీవీలు, మొబైళ్లు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌బీఐ కార్డు ద్వారా వన్‌ప్లస్‌ 10ఆర్‌ ప్రైమ్‌ బ్లూ ఎడిషన్‌ కొనుగోలు చేసేవారికి రూ.3,000 తక్షణ రాయితీ అందిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ ఉన్నవారికి అమెజాన్‌ పే ద్వారా చెల్లిస్తే మరో రూ.500 తగ్గుతుంది. ఇలా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచీలు, టీవీలపై వన్‌ప్లస్‌ అనేక ఆఫర్లను ప్రకటించింది. 

స్మార్ట్‌ టీవీలపై ఉన్న కొన్ని ఆఫర్లు..

వన్‌ప్లస్‌ టీవీ వై సిరీస్‌ 32/43 వై1ఎస్‌ ఎడ్జ్‌..

  • రూ.23,999 విలువ చేసే ఈ స్మార్ట్‌ టీవీని ఫెస్టివ్‌ సేల్‌ సందర్భంగా రూ.13,999కే అందిస్తున్నారు. 
  • యాక్సిస్‌ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే మరో రూ.2,000 తగ్గింపు లభిస్తుంది.
  • రెడ్‌ కేబుల్‌ క్లబ్‌కు అనుసంధానమైతే.. మరో రూ.2,000 రాయితీ లభిస్తుంది. ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

వన్‌ప్లస్‌ టీవీ వై సిరీస్‌ 32/43 వై1ఎస్‌..

  • రూ.21,999 విలువ చేసే ఈ స్మార్ట్‌ టీవీని ఫెస్టివ్‌ సేల్‌ సందర్భంగా రూ.12,999కే అందిస్తున్నారు. 
  • యాక్సిస్‌ బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే మరో రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.
  • రెడ్‌ కేబుల్‌ క్లబ్‌కు అనుసంధానమైతే.. మరో రూ.2,000 రాయితీ లభిస్తుంది. కావాలంటే నెలవారీ వాయిదా వసతిని ఉపయోగించుకోవచ్చు.

వన్‌ప్లస్‌ టీవీ 43/50 వై1ఎస్‌ ప్రో..

రూ.39,999 విలువ చేసే ఈ స్మార్ట్‌ టీవీని రూ.26,999కి పండగ సందర్భంగా విక్రయిస్తున్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా మరో రూ.3,000 వరకు రాయితీ లభిస్తుంది. రెడ్‌ కేబుల్‌కు అనుసంధానమైతే మరో రూ.2,000 తగ్గింపును పొందొచ్చు.

వన్‌ప్లస్‌ టీవీ యూ సిరీస్‌ 50/55/65 యూ1ఎస్‌..

ఈ స్మార్ట్‌ టీవీ వాస్తవ ధర రూ.49,999. కానీ, పండగ సేల్‌లో భాగంగా రూ.34,999కే అందిస్తున్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులను ఉపయోగించుకుంటే రూ.5,000 వరకు తక్షణ రాయితీని పొందొచ్చు. అలాగే ముందు తెలిపినట్లుగా రెడ్‌ కేబుల్‌ క్లబ్‌కు అనుసంధానమైతే రూ.2,000 అదనపు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్‌ టీవీ క్యూ1 సిరీస్‌

రూ.84,999 విలువ చేసే ఈ టీవీని రూ.74,900కే అందిస్తున్నారు. రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ ఆఫర్‌ ద్వారా మరో రూ.2,000 తగ్గించుకునే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు...

వన్‌ప్లస్‌ 10 ప్రో: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.61,999 ధరకే లభిస్తోంది. అదే 128జీబీ+256జీబీ వేరియంట్‌ మొబైల్‌ రూ.66,999కు పొందొచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ.6,000 తగ్గింపును పొందే అవకాశం లభిస్తోంది. వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ ఫోన్‌పై మరో రూ.10,000 రాయితీ పొందాలంటే వన్‌ప్లస్‌, ఐఫోన్‌ పాత స్మార్ట్‌ఫోన్లను ఎక్స్ఛేంజీ కింద ఇవ్వాలి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ: దీనిపై భారీ తగ్గింపును అందిస్తున్నారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేస్తే ఈ ఫోన్‌పై రూ.4,000 రాయితీని పొందొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2: ఈ ఫోన్‌ రూ.23,999 తగ్గింపు ధర వద్ద లభ్యమవుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా మరో రూ.1,500 రాయితీని పొందొచ్చు. అమెజాన్‌, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.500 అదనపు తగ్గింపును పొందొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2 లైట్‌ 5జీ: దీన్ని కొనుగోలు చేసేవారికి రూ.500 తక్షణ రాయితీ లభిస్తుంది. అమెజాన్‌, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,500 అదనపు తగ్గింపును పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని