OnePlus India: వన్‌ప్లస్‌ ఇండియాకు సీఈఓ నవనీత్‌ నక్రా గుడ్‌బై

OnePlus India CEO Quits: వన్‌ప్లస్‌ ఇండియాకు ఆ సంస్థ సీఈఓ నవనీత్‌ నక్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నానని తెలిపారు.  

Published : 01 Jun 2023 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్ ఇండియాకు (Oneplus India) ఆ కంపెనీ సీఈఓ నవనీత్‌ నక్రా (Navnit Nakra) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామాను వన్‌ప్లస్‌ ధ్రువీకరించింది. తన అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటున్నానని, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితం గడపాలనుకుంటున్నట్లు తెలిపారు.

2020లో నవనీత్‌ నక్రా వన్‌ప్లస్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా తన ప్రయాణం ప్రారంభించారు. 2021లో వన్‌ప్లస్‌ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. వన్‌ప్లస్‌లో చేరకముందు యాపిల్‌ కంపెనీలో పనిచేశారు. ఈ మూడేళ్ల ప్రయాణంలో వన్‌ప్లస్‌ ఇండియా అభివృద్దికి నక్రా ఎంతో కృషి చేశారని వన్‌ప్లస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన భవిష్యత్‌ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాక్షించింది. భారత రీజియన్‌పై మునుపటి ఫోకస్‌ కొసాగుతుందని వన్‌ప్లస్‌ పేర్కొంది. నక్రా హయాంలోనే నార్డ్‌ సిరీస్‌లో మిడ్‌ సెగ్మెంట్‌ స్మార్ట్‌ఫోన్లతో  పాటుు, ఇతర స్మార్ట్‌ డివైజులు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని