OnePlus: వన్‌ప్లస్ కొత్త ఉత్పత్తులు.. తొలి ట్యాబ్‌, 5జీ ఫోన్‌, బడ్స్‌.. ఇంకా!

ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ క్లౌడ్‌ 11 (OnePlus Cloud 11) పేరుతో దిల్లీలో లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐదు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. 

Published : 08 Feb 2023 01:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) కొత్తగా ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. దిల్లీలో జరిగిన వన్‌ప్లస్‌ క్లౌడ్‌ 11 (OnePlus Cloud 11) గ్లోబల్‌ ఈవెంట్‌లో వీటిని పరిచయం చేసింది. వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G) స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2 (OnePlus Buds Pro 2), వన్‌ప్లస్‌ పాడ్ (OnePlus Pad), వన్‌ప్లస్‌ టీవీ (Oneplus TV Q2 Pro), వన్‌ప్లస్‌ రౌటర్‌ (OnePlus Hub 5) ఈ జాబితాలో ఉన్నాయి. వాటి ఫీచర్ల వివరాలివే..

వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G)

ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ, 48 ఎంపీ, 32 ఎంపీ కెమెరాలను ఇస్తున్నారు. వీటిలో హాసిల్‌బ్లాడ్‌ కెమెరా సాంకేతికతతోపాటు ఆక్యుస్పెక్ర్టమ్‌ లైట్‌ కలర్‌ ఐడెంటిఫయర్‌ను ఉయోగించారు. ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 

ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీనికి 100 వాట్‌ సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ అడాప్టర్‌ ఇస్తున్నారు. దీంతో కేవలం 25 నిమిషాల్లో వంద శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. నాలుగేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇవ్వనున్నారు. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 55,999 కాగా, 12 జీబీ/256 జీబీ ధర రూ. 61,999. ఫిబ్రవరి 14 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ 11 ఆర్‌ (OnePlus 11R) ఫోన్‌ను కూడా విడుదల చేసింది. త్వరలో జరగబోయే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో వన్‌ప్లస్‌ 11 5జీ కాన్సెప్ట్‌  ఫోన్‌ (OnePlus 11 5G Concept Phone)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

వన్‌ప్లస్‌ పాడ్‌ (OnePlus Pad)

వన్‌ప్లస్ కంపెనీ వస్తోన్న తొలి ట్యాబ్‌ ఇదే. ఇందులో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 11.61 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి డాల్బీ విజన్‌ సపోర్ట్‌ ఉంది. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 9,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్‌ సూపర్‌వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ధర ప్రకటించాల్సి ఉంది. 

వన్‌ప్లస్‌ టీవీ క్యూ2 ప్రో (Oneplus TV Q2 Pro)

వన్‌ప్లస్ క్యూ సిరీస్‌లో 4k రిజల్యూషన్‌తో 65 అంగుళాల క్యూఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీని తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ఆక్సిజన్‌ప్లే 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 70 వాట్‌ స్పీకర్స్‌ ఉన్నాయి. దీని ధర రూ.99,999. మార్చి 10 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో 2 (OnePlus Buds Pro 2)

యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) ఫీచర్‌ ఉంది. ఇది 48 డెసిబిల్స్‌ వరకు ఎక్స్‌టర్నల్‌ నాయిస్‌ను అడ్డుకుంటుంది. బడ్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 9 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. స్టాండ్‌బై మోడ్‌లో 39 గంటలపాటు ఛార్జింగ్‌ ఉంటుదని కంపెనీ తెలిపింది. మూడు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. ఐపీ 55 వాటర్ రెసిస్టెంట్‌ ఉంది. వీటి ధర రూ. 11,999గా కంపెనీ నిర్ణయించింది. 

వీటితోపాటు వన్‌ప్లస్ హబ్‌ 5జీ (OnePlus Hub 5) రౌటర్‌ను కూడా విడుదల చేసింది. ఇది వైఫై 6ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5జీ, 4జీ సిమ్‌కార్డ్‌లను పెట్టుకోవచ్చు. జులైలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు