OnePlus Foldable Phone: వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ విడుదల ఎప్పుడంటే?

OnePlus Foldable Phone: ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో పోటీకి వన్‌ప్లస్‌ సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలోనే ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Updated : 01 Mar 2023 13:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ల (Foldable SmartPhone) మార్కెట్‌లో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో శామ్‌సంగ్‌ (Samsung) గట్టి పట్టు సాధించింది. తాజాగా మరో గ్లోబల్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ప్లస్‌ (OnePlus) కూడా పోటీకి సిద్ధమవుతోంది. ఫోల్డబుల్‌ ఫోన్ల (Foldable SmartPhone)లో కస్టమర్లకు ఇప్పటి వరకు మార్కెట్‌లో లేని ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని వన్‌ప్లస్‌ (OnePlus) ఉవ్విళ్లూరుతోంది.

2023 ద్వితీయార్ధంలో ఫోల్డబుల్‌ ఫోన్‌ తీసుకురానున్నట్లు వన్‌ప్లస్‌ (OnePlus Foldable SmartPhone) ప్రకటించింది. బార్సిలోనాలో జరుగుతోన్న ‘మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌’లో ఈ విషయాన్ని వెల్లడించింది. వన్‌ప్లస్‌ 11 విడుదల సందర్భంగానే కంపెనీ ఫోల్డబుల్‌ ఫోన్‌కు సంబంధించిన సంకేతాలు ఇచ్చింది. వన్‌ప్లస్‌ ఫోన్లలో సాధారణంగా ఉండే ‘ఫాస్ట్‌ అండ్‌ స్మూత్‌’ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు అత్యున్నత ఫీచర్లను అందించాలనుకుంటున్నామని తెలిపింది. డిజైన్‌, మెకానికల్‌ టెక్నాలజీ సహా అన్ని అంశాల్లో పరిశ్రమలో మేటి ఫోల్డబుల్‌ ఫోన్‌ను అందించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇంతకు మించి ఈ ఫోన్‌ గురించి వన్‌ప్లస్‌ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

బీబీకే యాజమాన్యంలోని ఒప్పోకు సబ్‌-బ్రాండ్‌గా ఉన్న వన్‌ప్లస్‌ హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో పట్టుకోసం శ్రమిస్తోంది. ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా బ్రాండ్‌కు ఉన్న విలువను మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే శామ్‌సంగ్‌, యాపిల్‌ వంటి వాటితో పోటీకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఫోల్డబుల్‌ ఫోన్‌ విభాగంలో 81 శాతం మార్కెట్‌ వాటా శామ్‌సంగ్‌దే. ప్రస్తుతం ఈ ఫోన్ల విక్రయాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో గిరాకీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాన్నుంచి లబ్ధి పొందాలని వన్‌ప్లస్‌ ప్రణాళికలు రచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు