MSME Credit: ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాల్లో 7 శాతమే మహిళలకు

సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) నీరజ్‌ నిగమ్‌ పేర్కొన్నారు.

Published : 06 Jul 2024 01:54 IST

 ఆర్‌బీఐ ఈడీ నీరజ్‌ నిగమ్‌ 

ముంబయి: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 7 శాతమే మహిళల ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు వెళ్లాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) నీరజ్‌ నిగమ్‌ పేర్కొన్నారు. మహిళా కార్మికులు తక్కువగా ఉండడం కూడా ఆర్థిక సంఘటితానికి, ఆర్థిక వృద్ధికి అడ్డుగోడగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారమిక్కడ నీతి ఆయోగ్, ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘ఫైనాన్సింగ్‌ ఉమెన్‌ కొలాబరేటివ్‌’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పాత్ర మరింతగా ఉంటేనే ఆర్థిక వృద్ధికి అవకాశం కలుగుతుంది. అయితే 2021-22లో మొత్తం కార్మిక శక్తిలో మహిళలు 32.8 శాతంగానే ఉన్నారు. అదే సమయంలో 20% ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను మహిళలే నిర్వహిస్తున్నప్పటికీ.. మొత్తం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రుణాల్లో మహిళల సంస్థలకు 7% రుణాలే మంజూరయ్యాయ’ని పేర్కొన్నారు. ఆర్థిక సేవల విషయంలో మాత్రం ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన్‌ మంత్రి జన్‌-ధన్‌ యోజన(పీఎమ్‌జేడీవై) పథకం, సామాజిక భద్రత పథకాలను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని