OPEC: చమురు ఉత్పత్తి పెంపునకు ‘ఒపెక్’ నిర్ణయం..!

చమురు ధరల్లో భారీగా పెరుగుదల, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉత్పత్తిని పెంచి పరిస్ధితిని చక్కదిద్దేందు

Updated : 03 Mar 2022 18:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చమురు ధరల్లో భారీగా పెరుగుదల, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఉత్పత్తిని పెంచి పరిస్ధితిని చక్కదిద్దేందుకు పెట్రోలియం ఉత్పత్తి, ఎగుమతి దేశాల సంస్ధ ‘ఒపెక్’ సిద్ధమైంది. 2022 ఏప్రిల్‌లో చమురు ఉత్పత్తిని రోజుకు 4లక్షల బ్యారెళ్లకు పెంచడానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్, దాని అనుబంధ దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు బుధవారం వర్చువల్‌గా సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్  తగ్గడంతో.. ఒపెక్, దాని అనుబంధ దేశాలు 2021 జులై నుంచి ప్రతి నెల ఉత్పత్తిని క్రమంగా తగ్గించాయి. ప్రస్తుతం వైరస్ ఉద్ధృతి తగ్గి.. ఆంక్షలను సడలించిన నేపథ్యంలో డిమాండ్ పెరిగినా ఉత్పత్తి ఆ స్ధాయిలో లేకపోవడంతో ఒపెక్ తాజా నిర్ణయం తీసుకుంది. బ్యారెల్ చమురు ధర బుధవారం 110 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని