Banks Strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ సేవలపై ప్రభావం

బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం నవంబర్‌ 19న సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

Published : 17 Nov 2022 17:14 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘం నవంబర్‌ 19న (మూడో శనివారం) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొన్ని కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ముకు, భద్రతకు విఘాతం కలుగుతుందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. ఈ విధానాల వల్ల ఉద్యోగాలతో పాటు, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. అందుకే తమ ఆందోళన తెలియజేసేందుకు ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమ్మెలో బ్యాంక్‌ ఉన్నతోద్యోగులు పాల్గొనడం లేదు. కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారు. దీంతో క్యాష్‌ డిపాజిట్‌, విత్‌డ్రా, చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలపై ప్రభావం పడనుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఇప్పటికే తమ ఖాతాదారులకు ఈ విషయమై సమాచారం ఇచ్చాయి. ఒకవేళ ప్రభుత్వ బ్యాంకుల్లో పని ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని