Oppo F23: ఒప్పో నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 44 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్!

Oppo F23 5G Specification: ఒప్పో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. 64 ఎంపీ కెమెరా, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

Published : 15 May 2023 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఒప్పో ఎఫ్‌ 23 5జీ (Oppo F23 5G) పేరిట దీన్ని సోమవారం జరిగిన ఈవెంట్‌లో లాంచ్‌ చేసింది. మే 18 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 5జీ ఫోన్లకు డిమాండ్‌ పెరిగిన వేళ ఒప్పో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఒప్పో ఎఫ్‌23 5జీ స్మార్ట్‌ఫోన్‌ సింగిల్‌ వేరియంట్‌లో వస్తుంది. 8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజీ వేరియంట్‌లో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బోల్డ్‌ గోల్డ్‌, కూల్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. దీని ధరను కంపెనీ రూ.24,999గా నిర్ణయించింది. మే 18 నుంచి ఒప్పో, అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులపై కొనుగోళ్లపై డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఎక్స్ఛేంజీ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. (Oppo F23 5G Specification) ఇందులో ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 13.1ను అందిస్తున్నారు. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఉంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు. వర్చువల్‌ ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు. వెనుక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2 ఎంపీ మోనో సెన్సర్‌, 2 ఎంపీ మైక్రో సెన్సర్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్ మర్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 44 నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు