Oppo F27 Pro+: వాటర్‌ ప్రూఫ్‌తో ఒప్పో ఎఫ్‌27 ప్రో+.. వివరాలు ఇవే..

Oppo F27 Pro+: ఒప్పో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.28 వేలుగా నిర్ణయించింది.

Published : 13 Jun 2024 16:12 IST

Oppo F27 Pro+ | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో.. ఎఫ్‌ 27 ప్రో+ (Oppo F27 Pro+) పేరిట కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపీ 69, ఐపీ 68, ఐపీ 66 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. అంటే నీరు, ధూళి వంటి వాటినుంచి రక్షణ ఉంటుంది. దేశీయ తొలి వాటర్‌ ప్రూఫ్‌ ఫోన్‌ ఇదేనని కంపెనీ పేర్కొంటోంది. లెదర్‌ ఫినిష్‌, కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణలు.

ఒప్పో ఎఫ్‌ 27 ప్రో+ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరయంట్‌ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా పేర్కొంది. ప్రీ ఆర్డర్స్‌ ప్రారంభం అయ్యాయి. జూన్‌ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్లలో లభిస్తుంది. డస్క్‌ పింక్‌, మిడ్‌నైట్‌ నావీ రంగుల్లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

ట్రాయ్‌ కొత్త సిఫార్సులు.. ఫోన్‌ నంబర్‌కూ ఇక ఛార్జీ..?

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఒప్పో ఎఫ్‌ 27 ప్రో+ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్‌ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో 950 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగిఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌తో వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ ఓఎస్‌తో వస్తోంది. వెనకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌ ఇచ్చారు. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67W సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని