ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్ధరణకు LIC మరో అవకాశం

ల్యాప్స్‌ అయిన పాలసీలను ఆలస్యపు రుసుము రాయితీతో పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్‌ఐసీ కల్పిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది.

Published : 03 Feb 2023 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) తమ పాలసీదారులకు శుభవార్త తెలిపింది. లాప్స్‌ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేప్పట్టింది. ప్రీమియం చెల్లింపుల గడువు దాటి, కాలవ్యవధి పూర్తికాని పాలసీలను ఈ కార్యక్రమంలో పునరుద్ధరించుకోవచ్చు. ఈ ప్రక్రియ 2023 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు అమల్లో ఉంటుందని ఎల్‌ఐసీ తెలియజేసింది. ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయి ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. అలాగే, ఆలస్య రుసుము విషయంలోనూ రాయితీ ఇస్తున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. 

రాయితీలు ఇలా..

NACH, BILL Pay రిజిస్టర్డ్‌ పాలసీలకు ప్రత్యేక ఆఫర్‌ ఆలస్యపు రుసుము రూ.5 (జీఎస్‌టీ కాకుండా) వర్తిస్తుంది.

వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు పొందే విధానం..

  • మీ ఫోన్‌లోని వాట్సాప్‌ అప్లికేషన్‌ ద్వారా ‘Hi’ అని టైప్‌ చేసి 89768 62090 నంబరుకు పంపాలి. 
  • ఇప్పుడు మీకు 11 ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. 
  • మీకు కావాల్సిన ఆప్షన్‌కు సంబంధించిన నంబరును పంపాలి. ఉదాహరణకు ఎల్‌ఐసీ ప్రీమియం ఎంత చెల్లించాలో తెలుసుకునేందుకు ‘1’ ని పంపితే సరిపోతుంది.
  • మీరు అడిగిన వివరాలను ఎల్ఐసీ వాట్సాప్‌  చాట్‌లో పంపిస్తుంది.

ఎల్‌ఐసీ వాట్సాప్‌ ద్వారా అందించే సేవలు

1. ఎంత ప్రీమియం చెల్లించాలి
2. బోనస్‌ సమాచారం
3. పాలసీ స్థితి
4. రుణ అర్హత
5. రుణ చెల్లింపుల కొటేషన్
6. రుణంపై చెల్లించాల్సిన వడ్డీ
7. ప్రీమియం చెల్లించిన సర్టిఫికేట్
8. ULIP-యూనిట్‌ల స్టేట్‌మెంట్
9. ఎల్‌ఐసి సేవల లింక్‌లు
10.సేవలను ప్రారంభించడం లేదా నిలిపివేయడం
11. సంభాషణను ముగించడం

పాలసీ ఎప్పుడు ల్యాప్స్‌ అవుతుంది?

పాలసీకి సంబంధించిన ప్రీమియం నిర్ణీత గడువులోపు చెల్లించాలి. పాలసీలకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈలోపు కూడా చెల్లించవచ్చు. ఒకవేళ గ్రేస్‌ పీరియడ్‌ లోపు కూడా చెల్లింపులు చేయకపోతే పాలసీ ల్యాప్స్‌ అవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని