ATM Cash Withdrawal: ఏటీఎంలో నగదు విత్‌డ్రానా?త్వరలో మొబైల్‌ కూడా తప్పనిసరి కావొచ్చు!

ATM Cash Withdrawal: ఏటీఎం వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు త్వరలో మొబైల్‌ కూడా తప్పనిసరి కావొచ్చు...

Updated : 25 Jul 2022 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటీఎం (ATM)ల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)’ ఓటీపీ (OTP) విధానాన్ని గతంలోనే తీసుకొచ్చింది. అన‌ధికారిక లావాదేవీల‌ నుంచి ఖాతాదారుల‌కు ఈ విధానం రక్షణ క‌ల్పిస్తుంది. రూ.10 వేలు, అంత‌కంటే ఎక్కువ మొత్తంలో న‌గ‌దు విత్‌డ్రా (Cash Withdrawal) చేసుకోవాలంటే డెబిట్ కార్డుతో పాటు ఓటీపీ (OTP)ని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ (SBI) దీన్ని జనవరి 1, 2020 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, ఖాతాదారుల ప్రయోజనాలను, వారి లాలాదేవీలకు భద్రతను దృష్టిలో ఉంచుకొని త్వరలో ఈ విధానాన్ని ఇతర బ్యాంకులు కూడా అమలు చేసే యోచనలో ఉన్నాయని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా సిస్టమ్‌ ఎలా ప‌నిచేస్తుంది?

* ఈ విధానంలో ఎస్‌బీఐ ఏటీఎంల వ‌ద్ద న‌గ‌దు విత్‌డ్రా చేసేందుకు ఓటీపీ, డెబిట్‌కార్డు అవ‌స‌రం.

* ఏటీఎంలో కార్డు ఇన్‌స‌ర్ట్ చేసి, డెబిట్ కార్డు పిన్ నంబర్‌, విత్‌డ్రా మొత్తాన్ని ఎంట‌ర్ చేసిన త‌ర్వాత ఓటీపీ ఎంట‌ర్ చేయాలని అడుగుతుంది.

* ఖాతాదారుడు బ్యాంకు వ‌ద్ద రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వ‌స్తుంది.

* ఓటీపీ అనేది నాలుగు అంకెల సంఖ్య. ఒక‌సారి వ‌చ్చిన ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే ప‌నిచేస్తుంది.

* ఓటీపీ ఎంట‌ర్ చేసిన వెంటనే నగదు మొత్తం బయటకు వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని