PM Kisan: పీఎమ్‌ కిసాన్ పోర్ట‌ల్‌లో ఓటీపీ ఆధారిత ఇకేవైసి.. అప్‌డేట్ చేయండిలా!

పీఎమ్ కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకున్న రైతులు ఆన్‌లైన్‌లో ద్వారా ఇకేవైసిని అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. ఇంద‌కు ఆప్ష‌న్‌ పీఎమ్‌-కిసాన్ పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉంది. 

Updated : 10 May 2022 16:44 IST

ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (పీఎం - కిసాన్‌) కింద ప్ర‌యోజ‌నాలు పొందేందుకు రైతులు ఇకేవైసీని త‌ప్ప‌నిసరిగా పూర్తిచేయాలి. ఇందుకు చివ‌రి తేది మే 31, 2022. పీఎమ్ కిసాన్‌కి రిజిస్ట‌ర్ చేసుకున్న‌ రైతులు ఆన్‌లైన్‌లో పీఎమ్ కిసాన్ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌లో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను (సీఎస్‌సీ)కి వెళ్లిగాని ఇకేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు. ఆధార్ కార్డుతో సీఎస్‌సీ సెంట‌ర్‌కి వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా ఇకేవైసి పూర్తిచేయ‌వ‌చ్చు. 

ఆఫ్‌లైన్‌లో ఓటీపీ ఆధారిత ఇకేవైసి పూర్తి చేసే విధానం..
*
ముందుగా పీఎమ్ కిసాన్ (https://pmkisan.gov.in/) వెబ్‌సైట్‌ని సంద‌ర్శించాలి.
* ఫార్మ‌ర్స్ కార్న‌ర్ కింద ఉన్న ఇకేవైసి ట్యాబ్‌ని క్లిక్ చేస్తే త‌ర్వాతి పేజికి వెళ్తుంది
* ఇక్క‌డ మీ ఆధార్ కార్డు నంబ‌రును ఎంట‌ర్ చేసి సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 
* ఇప్పుడు స్క్రీన్‌పై ఎంట‌ర్ మొబైల్  నంబ‌ర్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. (ఇది ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ అయిన వారికి మాత్ర‌మే వ‌స్తుంది. రిజిస్ట‌ర్ చేసుకోని వారికి ఎర్ర‌ర్ వ‌స్తుంది)
* ఇక్క‌డ రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌రు ఎంట‌ర్ చేసి ప్ర‌క్క‌న ఉన్న గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. 
* మీ మొబైల్ నంబ‌రుకు 4 అంకెల ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి. 
* ఇప్పుడు మ‌ర‌ల ఆధార్ రిజిస్ట‌ర్డ్ ఓటీపీ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌రుకు మ‌రొక ఓటీపీ వ‌స్తుంది. దీన్ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేస్తే ఇకేవైసీ పూర్త‌వుతుంది. 

జ‌న‌వ‌రి 1, 2022న పీఎమ్ - కిసాన్ ప్రోగ్రామ్ కింద 10 వాయిదా నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. 11వ వాయిదా నిధుల‌ను ఎప్పుడైనా విడుద‌ల చేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి అర్హులైన రైతులు వెంట‌నే ఇకేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని