Air India: వచ్చే 15 నెలల్లో ఎయిరిండియా సేవల్లోకి మరో 30 విమానాలు

ఎయిరిండియా ఈ ఏడాది డిసెంబరు నుంచి క్రమంగా 30 కొత్త విమానాలను సేవల్లో చేర్చనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది....

Published : 12 Sep 2022 14:28 IST

దిల్లీ: టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ సేవల్ని మరింత విస్తరించే యోచనలో ఉంది. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబరు నుంచి క్రమంగా 30 కొత్త విమానాలను సేవల్లో చేర్చనున్నట్లు సోమవారం ప్రకటించింది. వీటిలో ఐదు బోయింగ్‌ పెద్ద విమానాలు, 25 ఎయిర్‌బస్‌ చిన్న విమానాలు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీలతో లీజు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. 

ఈ కొత్త వాటి చేరికతో ఎయిరిండియా వద్ద ఉన్న మొత్తం విమానాల సంఖ్య మరో 25 శాతం పెరుగుతుందని కంపెనీ తెలిపింది. సంస్థ లీజుకు తీసుకొన్న వాటిలో 21 ఎయిర్‌బస్‌ ఏ320 నియోస్‌, 4 ఎయిర్‌బస్‌ ఏ321, ఐదు బోయింగ్‌ బీ777-200ఎల్‌ఆర్‌ విమానాలు ఉండనున్నట్లు పేర్కొంది. బోయింగ్‌ విమానాలు 2022 డిసెంబరు నుంచి 2023 మార్చి మధ్య సేవల్లో చేరనున్నట్లు తెలిపింది. కొత్త వాటిని భారత్‌లో వివిధ మెట్రో నగరాల నుంచి అమెరికాకు వెళ్లే మార్గాల్లో నడపనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని