OYO: నీట్‌ పరీక్ష రాసే విద్యార్థినులకు ఓయో అదిరే డిస్కౌంట్‌!

ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ (OYO) సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. నీట్‌-2022 పరీక్ష (NEET 2022 exams) రాయనున్న ......

Published : 13 Jul 2022 16:24 IST

దిల్లీ: ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ (OYO) సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. నీట్‌-2022 పరీక్ష (NEET 2022 exams) రాయనున్న విద్యార్థినుల కోసం ప్రత్యేక డిస్కౌంట్‌ ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థినులు తమ హోటళ్లలో బస చేస్తే 60 శాతం వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది. ఈ పరిమిత కాలపు డిస్కౌంట్‌ స్కీమ్‌ కేవలం రెండు రోజులు (జులై 16, 17 తేదీల్లో) మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో వసతి అవసరాలను అందించడం ద్వారా విద్యార్థినులకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ నెల 17న (ఆదివారం) దేశవ్యాప్తంగా 497 నగరాలు/పట్టణాల్లో నీట్‌ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. దాదాపు 18లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.

డిస్కౌంట్‌ ఇలా పొందాలి..
ఈ డిస్కౌంట్‌ను పొందాలనుకుంటే తొలుత ఓయో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎర్ర రంగులో నియర్‌బై ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ పరీక్ష కేంద్రానికి సమీపంలోని హోటల్‌ను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత కూపన్‌ కోడ్‌ NEETJFను సెలక్ట్‌ చేసుకొని Book nowపై క్లిక్‌ చేసిన నగదు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఓయో తెలిపింది. విద్యార్థులు ఎంచుకొనే హోటళ్లలో వైఫైతో పాటు ఏసీ సదుపాయాలు కూడా ఉంటాయని ఓయో తెలిపింది. ఇటీవల ఎంఎస్‌ఎంఈ దినోత్సవం సందర్భంగా చిన్న, మధ్యతరగతి వ్యాపారుల కోసం 60శాతం డిస్కౌంట్‌తో జూన్‌ 27 నుంచి జులై 3వరకు ఓయో ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని