Russian crude: 50 డాలర్లకే పాక్‌కు రష్యా చమురు?
Russian crude: బ్యారెల్ ముడి చమురును 50 డాలర్లకే కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు ఇరు దేశాల్లోని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ (Pakistan).. రష్యా నుంచి చాలా తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా చమురు (Russian Oil)పై జీ7 దేశాలు విధించిన పరిమితి కంటే కూడా తక్కువకే కొనేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే చమురుపై జీ7 దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తక్కువ ధరకే చమురును విక్రయించేందుకు రష్యా ముందుకు వచ్చింది. భారత్ సైతం రాయితీ ధరకు రష్యా (Russia) నుంచి భారీ ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది.
బ్యారెల్ ముడి చమురును 50 డాలర్లకే కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు ఇరు దేశాల్లోని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జీ7 దేశాలు విధించిన పరిమితి కంటే ఇది 10 డాలర్లు తక్కువ. అధిక మొత్తంలో విదేశీ అప్పులు, మారక నిల్వల కొరత, దేశీయ కరెన్సీ విలువ పతనం వంటి ఆర్థిక సమస్యలతో పాక్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు దిగుమతి ఆ దేశానికి పెద్ద భారంగా పరిణమించింది. దాన్ని తగ్గించుకోవడానికి వీలైనంత తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి పాక్ చాలా కాలం క్రితమే రష్యా (Russia)తో చర్చలు జరుపుతోంది. కానీ, పాక్ ఆర్థిక పరిస్థితిని గమనించిన రష్యా.. చెల్లింపులపై కచ్చితమైన హామీ వచ్చే వరకు ఒప్పందం ఖరారుకు ముందుకు రాలేదు. కానీ, పాక్‌కు ఇప్పుడు గత్యంతరం లేకపోవడంతో రష్యా కోరిన షరతులన్నింటినీ సంతృప్తి పరిచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ముందు ఒక చమురు నౌకను పాక్‌కు పంపాలని రష్యా నిర్ణయించింది. చెల్లింపులు, ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులన్నింటి విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు రష్యా నుంచి బయలుదేరనున్న తొలి చమురు నౌక వచ్చే నెలాఖరుకు పాకిస్థాన్ చేరే అవకాశం ఉంది. అది సజావుగా సాగితే దీర్ఘకాల ఒప్పందం ఖరారు కావొచ్చు. రష్యా నౌకాశ్రయాల నుంచి పాక్‌కు చమురును చేర్చడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుంది. దీంతో రవాణా ఖర్చుల రూపంలో ఒక్కో బ్యారెల్‌పై అదనంగా 10-15 డాలర్లు పెరుగుతుంది. పాకిస్థాన్ యూఎస్ డాలర్ల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. రష్యాకు మిత్రదేశాల కరెన్సీల్లో చెల్లింపులు చేసే అవకాశం ఉందని సమాచారం. సౌదీ అరేబియా, చైనా, యూఏఈ కరెన్సీల్లో చెల్లింపులు ఉండొచ్చని తెలుస్తోంది.
కొన్ని వారాల క్రితం పాకిస్థాన్ మారక నిల్వలు 2.9 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇటీవల అవి తిరిగి 4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఐఎంఎఫ్ నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ కోసం పాక్ వేచిచూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పలు దఫాల్లో చర్చలు జరిగాయి. ఐఎంఎఫ్ విధించిన పలు షరతులను సైతం పాకిస్థాన్ ఇప్పటికే అమలు చేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YS Sharmila: టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్
-
Crime News
Hyderabad: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
General News
Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
Movies News
Kajal: బాలీవుడ్లో నైతిక విలువలు లోపించాయి.. కాజల్ కీలక వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: ఆ జట్టుదే ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్: మైకెల్ వాన్
-
General News
Sajjanar: గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్ విజ్ఞప్తి