Pak Defence Budget: పాక్ రక్షణ బడ్జెట్‌ ఎంతో తెలుసా?

వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్‌ రక్షణ బడ్జెట్‌ 7.6 బిలియన్‌ డాలర్లుగా ఉండనున్నట్లు సమాచారం....

Published : 05 Jun 2022 15:30 IST

ఇస్లామాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్‌ రక్షణ బడ్జెట్‌ 7.6 బిలియన్‌ డాలర్లుగా ఉండనున్నట్లు సమాచారం. ఇది పాకిస్థాన్‌ కరెన్సీలో రూ.1.4 లక్షల కోట్లకు సమానం. అదే భారత కరెన్సీలో దీని విలువ రూ.59 వేల కోట్లు.. పాకిస్థాన్‌ ఆర్థిక సంవత్సరం జులై 1న ప్రారంభమై జూన్‌ 30న ముగుస్తుంది.

పెంచిన మొత్తంలో అధిక భాగం సైనికుల వేతనాలు, అలవెన్సుల వంటి ఖర్చులకే వెచ్చించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని మౌలిక వసతుల ఏర్పాటు, ఆయుధాల కొనుగోలు, శిక్షణ, రవాణా, చికిత్స, దిగుమతుల వంటి విభాగాలకు కేటాయించనున్నట్లు ఆ దేశ ప్రముఖ పత్రిక డాన్‌ ఓ కథనంలో పేర్కొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌ ఒక్కో సైనికుడిపై ఏటా రూ.2.65 మిలియన్లు ఖర్చు చేస్తోంది. ఇది భారత్‌ ఒక్కో సైనికుడిపై చేస్తున్న వ్యయంతో పోలిస్తే మూడోవంతు కూడా కాదు. రక్షణ రంగానికి పాక్‌ కేటాయిస్తున్న నిధులు ఆ దేశ బడ్జెట్‌లో 16 శాతానికి సమానం కాగా.. దేశ జీడీపీలో 2.2 శాతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని