పాక్షికంగా సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు... అయితే?
యూలిప్స్ను స్వాధీనం చేయకుండా కొనసాగిస్తూనే పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేయవచ్చు. అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
సాధారణంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలు(యూలిప్స్) అయిదేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. దీని తర్వాత పాలసీని స్వాధీనం చేసి మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి స్వాధీన రుసుములు, నిష్క్రమణ ఛార్జీలు ఉండవు. పాలసీని కొనసాగిస్తూనే డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేదా అనే సందేహం కలగక మానదు… పాక్షికంగా డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు యూలిప్స్ అవకాశం కల్పిస్తున్నాయి. అయితే కొన్ని నిబంధనలున్నాయి… అవేమిటో తెలుసుకుందాం,…
పరిమితులు
యూలిప్స్ లో అయిదేళ్ల లాకిన్ పీరియడ్ అంటే ఈ మధ్యకాలంలో ఎలాంటి డబ్బు ఉపసంహరణ చేయలేం. స్వాధీనం చేయాలన్నా, పాలసీని కొనసాగించకుండా ఉండాలన్నా అయిదేళ్ల లాకిన్ గడువు ముగిసే దాకా వేచిచూడాల్సిందే.
పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసుకునేందుకు సైతం అయిదేళ్లు ఆగాల్సిందే. యూలిప్స్‌లో మాదిరిగా యూనిట్ ఆధారిత పింఛను పథకం నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసుకునేందుకు అవకాశం లేదు. మైనర్ పేరిట యూలిప్స్ను తీసుకున్నట్లయితే … లాకిన్ గడువు ముగిసినా సరే… మేజర్ అయ్యాకే పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు అనుమతినిస్తారు.
టాప్ అప్ విషయంలో…
-
యూలిప్స్ పాలసీకి టాప్ అప్ వేయించినట్లయితే … పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను ముందుగా ఈ టాప్ అప్ సొమ్ము నుంచి తీసుకోవాలనే నిబంధన ఉంది.
-
యూలిప్స్‌లో సాధారణ ప్రీమియంకు అదనంగా చెల్లించే డబ్బునే టాప్ అప్ ప్రీమియం అంటారు. టాప్ అప్ పరిమాణం బీమా ఒప్పందానికి లోబడి ఉంటుంది.
-
బేస్ పాలసీ నుంచి కూడా పాక్షిక విత్‌డ్రాయల్స్ కు అనుమతి ఉంది. టాప్ అప్ ప్రీమియంలకు కూడా అయిదేళ్ల లాకిన్ గడువు ఉంటుంది. టాప్ అప్ ఇంకా లాకిన్ గడువులోనే ఉన్నట్లయితే బేస్ పాలసీ నుంచి పాక్షిక విత్ డ్రాయల్స్ చేసుకోవచ్చు.
విత్‌డ్రాయల్స్ పరిమితి
పాలసీదారు ఎంత పరిమితి మేరకు డబ్బు విత్ డ్రా చేయాలనే దానికి ఎలాంటి నిబంధనలు లేవు. అయితే పాలసీ రద్దు అయ్యేంతలా సొమ్మును విత్‌డ్రా చేయవద్దని నిబంధనలు మాత్రం ఉన్నాయి. కనీసం పాలసీ నిర్వహించేందుకు కూడా వీల్లేకుండా యులిప్స్ నుంచి సొమ్ము విత్‌డ్రా చేయలేం.
పాలసీ రకాన్ని బట్టి పరిమితులు
-
యూలిప్స్‌లో పాలసీ రకాన్ని బట్టి విత్‌డ్రాయల్స్ పరిమితులను విధించారు. ఉదాహరణకు రెగ్యులర్ ప్రీమియం యూలిప్ తీసుకున్నట్లయితే వార్షిక ప్రీమియం విలువతో పోలిస్తే అందులో కనీసం మూడో వంతు నిధులు ఉండేలా చూసుకోవాలి. అంటే రూ.3000 వార్షిక ప్రీమియం ఉంటే… యులిప్స్‌లో నిల్వ ఉంచాల్సిన కనీసం రూ.1000. ఆ పైన ఉన్నది విత్‌డ్రా చేసుకోవచ్చు.
-
చెల్లించిన మొత్తం ప్రీమియంలలో ఒక సారికి 10శాతం మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని కొన్ని బీమా సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరి కొన్ని బీమా సంస్థలు పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు మధ్య కనీసం మూడు నెలల వ్యవధి ఉండాలని చెబుతున్నాయి.
-
చెల్లించిన మొత్తం ప్రీమియం సొమ్ములో 50శాతానికి మించి విత్‌డ్రా చేసేందుకు వీల్లేదని నిబంధన ఉంది.
రూ.500 కూడా…
మరి కొన్ని పాలసీలు పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసుకునేందుకు ఎలాంటి పరిమితులు విధించడం లేదు. ఇష్టమొచ్చినన్ని సార్లు పాలసీ నుంచి డబ్బు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కేవలం రూ.500 కూడా డ్రా చేసుకోవచ్చు.
-
విత్ డ్రా రిక్వెస్ట్ అందుకున్న పాలసీ నిర్వాహకులు సొమ్ముకు సమానమైన యూనిట్లను రద్దు చేసి డబ్బు జమచేస్తారు.
-
మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అందుకున్న విత్ డ్రా రిక్వెస్ట్‌ను తదుపరి రోజు ఎన్ఏవీ ఆధారంగా యూనిట్లను రద్దు చేశాకే సొమ్ము జమచేస్తారు.
బీమా కవరేజీ మారుతుందా?
-
పాక్షికంగా విత్ డ్రా చేసే సొమ్ము ప్రభావం బీమా కవరేజీపై ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. పాలసీదారు మృతిచెందే కంటే 2 ఏళ్ల ముందు చేసిన పాక్షిక విత్ డ్రాయల్స్ వల్ల బీమా కవరేజీలో మార్పు ఉంటుంది. 2 ఏళ్లకు మించి ఏదైనా పాక్షిక విత్‌డ్రాయల్స్ చేసినట్లయితే కవరేజీపై ప్రభావం ఉండదు.
-
అయితే 60 ఏళ్లు నిండిన పాలసీదారుకు ఈ షరుతులు వర్తించవు. పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు సంబంధం లేకుండా బీమా కవరేజీ మేరకు పరిహారాన్ని నామినీకి అందజేస్తారు.
Source: LiveMint
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్