Passenger vehicle: 11% పెరిగిన ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు

దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు వికయ్రాలు ఈ ఏడాది జులైలో 11 శాతం పెరిగాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది....

Published : 12 Aug 2022 23:22 IST

దిల్లీ: దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు వికయ్రాలు ఈ ఏడాది జులైలో 11 శాతం పెరిగాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది. సెమీకండక్టర్ల సరఫరా మెరుగై, వాహనాల ఉత్పత్తి పెరగడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. మరోవైపు రానున్న పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు తయారీని వేగవంతం చేశాయి. సియామ్‌ గణాంకాల ప్రకారం..

ఈ ఏడాది జూన్‌లో కంపెనీల నుంచి డీలర్లకు 2,93,865 ప్రయాణికుల వాహనాలు చేరాయి. 2021 జూన్‌లో ఇవి 2,64,442గా నమోదయ్యాయి.

ప్యాసింజర్‌ కార్ల సరఫరా వార్షిక ప్రాతిపదికన 10 శాతం మెరుగై 1,30,080 యూనిట్ల నుంచి 1,43,522 యూనిట్లకు చేరాయి.

వినియోగ వాహనాల టోకు విక్రయాలు 11 శాతం పెరిగి 1,37,104 యూనిట్లుగా నమోదయ్యాయి.

వ్యాన్ల సరఫరా జులై 2021లో నమోదైన 10,305 వాహనాల నుంచి 13,239 యూనిట్లకు చేరింది.

★ ద్విచక్రవాహన టోకు విక్రయాలు 10 శాతం పెరిగి 12,60,140 యూనిట్ల నుంచి 13,81,303 యూనిట్లకు చేరాయి.

స్కూటర్ల విక్రయాలు 3,73,695 యూనిట్ల నుంచి 4,79,159 యూనిట్లకు పెరిగాయి.

త్రిచక్ర వాహనాల టోకు సరఫరా 18,132 యూనిట్ల నుంచి 31,324 యూనిట్లకు చేరాయి.

ఎంట్రీ లెవెల్‌ ప్యాసింజర్‌ కార్లు, ద్విచక్ర వాహనాలు, తిచక్ర వాహనాల మార్కెట్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు. వరుసగా మూడోసారి రెపో రేటు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం వల్ల రుణాలు మరింత భారంగా మారతాయని తెలిపారు. ఇది ప్యాసింజర్‌ కార్ల రివకరీకి అడ్డంకిగా మారతుందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో మెరుగుదల కారణంగా గత నెలలో ప్రయాణికుల వాహనాల సరఫరా మెరుగుపడిందని మేనన్‌ చెప్పారు. సీఎన్‌జీ సెగ్మెంట్‌కు దేశీయ గ్యాస్‌ను అధిక మొత్తంలో కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని